TRAVEL INSURANCE – Telugu Policy
TRAVEL INSURANCE – Telugu Policy : – ట్రావెల్ ఇన్సూరెన్స్ ని తెలుగులో ప్రయాణ బీమా అంటారు అనగా ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలు అనగా ప్రయాణ సమయంలో మం వెంట తెచ్చుకున్న బ్యాగులు తప్పిపోవటం అందులో ఉన్న విలువైన వస్తువులు ఆభరణాలు ,సెల్ ఫోన్ లైసెన్సుసులు పాస్ పోర్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులులకు ప్రయాణ బీమా పరిహారం అందిస్తుంది అలాగే మీరు ప్రయాణిస్తున్న మీ విమానం ఆలస్యం ,రద్దు మిస్ అవ్వటం లాంటి నష్టాలను కవర్ చేస్తుంది ప్రయాణాల్లో ఎదురయ్యే మెడికల్ ఎమెర్జెన్సీలు రోడ్డు ప్రమాదాలు దొంగతనాలు స్కామ్స్ నుండి మిమ్మల్ని కాపాడుతుంది అలాగే విదేశాల్లో మీరు కారు నడుపుతున్నప్పుడు ఏదేని ప్రమాదం జరిగితే ప్రయాణ బీమా కవర్ చేస్తుంది విదేశాల్లో ఏదేని చట్టపరమైన కేసుల్లో ఇరుక్కుంటే ”పర్సనల్ లయబిలిటీ బెయిల్ బాండ్ ” ఇచ్చి ప్రయాణ బీమా మీకు సహాయం చేస్తుంది కొన్ని దేశాల్లో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా ప్రయాణ బీమా అవసరం లేదంటే ఆ దేశాలు వీసా జారీ చెయ్యవు మీ విధే పర్యటనలో ఆహ్లాదం కోసం లేదా ఏదేని సహస క్రీడలలో దురదృష్టశాత్తు ఏదేని ప్రమాదం జరిగిన ప్రయాణ బీమా కవర్చేస్తుంది విధంగా ప్రయాణాల్లోఎదురయ్యే ఆర్ధిక నష్టాలను అత్యవసర పరిస్థితులను నుండి ప్రయాణ బీమా తక్షణ నిస్తుంది.రకా
ట్రావెల్ ఇన్సూరెన్స్ రకాలు :
1 వ్యక్తిగత ప్రయాణ బీమా
2 ఫామిలీ ప్రయాణ బీమా
3 స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్
4 సీనియర్ సిటిజెన్ ట్రావెల్ ఇన్సూరెన్స్
5 గ్రూప్ ట్రావెల్ ఇన్సూరెన్స్
6 కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్
7 డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్
8 ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్
9 స్కెన్ జెన్ (26)యూరప్ దేశాల ట్రావెల్ ఇన్సూరెన్స్
10 సింగిల్ ట్రిప్ ట్రావెలిన్స్యూరెన్సు
11 మల్టిట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్
వీటిని గురించి వివరంగా తెల్సుకుందాం
1 ఇండివిసువల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ :ఒంటరిగా ప్రయాణం చేసే వారికీ ఈ పాలసీ సరిగ్గా పనిచేస్తుంది ఈ పాలసీలో ప్రయాణం మొదలై ఇంటికి చేరడంతో ఈ పాలసీ ముగుస్తుంది
2 ఫామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ : ఒకే కుటుంబంలోని సంభ్యులందరు కలసి ప్రయాణం చేసే వారికి ఈ పాలసీ సరిపోతుంది
3 స్టూడెంట్ ట్రావెలిన్స్యూరెన్సు : విదేశాల్లో చదువుకోసం వెళ్లే విద్యార్థుల కోసం ఈ పాలసీ రూపొందించబడింది.విదేశాల్లో ఎదురయ్యే వైద్య పరమైన సమస్యలకు రోడ్డు ప్రమాదాలు ఏదేని నేరంతో సంభంధం ఉంటె పర్సనల్ లయబిలిటీ బెయిల్ బాండ్ లాంటివి కవర్ చేస్తుంది
4 సీనియర్ సిటిజెన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ : వృద్ధులు 60 సంవత్సరాలకంటే ఫై బడిన వారి కోసం ఈ పాలసీ రూపొందించబడ్డది ప్రయాణాల్లో ఊహించని విద్య ఖర్చులు విదేశాల్లో మరణిస్తే మృతదేశాన్ని స్వదేశానికి పంపించడం లాంటి అత్యవసర ఆర్ధిక పరిస్థితులనుండి కాపాడుతుంది
5 గ్రూప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ : కొంత మంది వ్యక్తులు గ్రూప్ గా ప్రయాణం చేసే వారికోసం ఈ పాలసీ ఉపయోగపడుతుంది
6 కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ : కార్పొరేట్ సంస్థలు లేదా కంపెనీలు తమ ఉద్యోగుల కోసం తమ వ్యాపార ప్రయాణాల్లో భాగంగా ప్రయాణం చేసేవారికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది
7 డొమెస్టిక్ ట్రావెల్ పాలసీ : ఏది మన దేశంలోని వివిధ ప్రదేశాలకు ప్రాంతాలకు ప్రయాణం చేసే వారి కోసం ఈ పాలసీ పని చేస్తుంది మన దేశంలో ప్రయాణం చేస్తున్నపుడు ఎదురయ్యే ఆర్ధిక నష్టాలనుండి కవర్ చేస్తుంది
8 ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ : విదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురయ్యే ఆర్ధిక నష్టాలనుండి కాపాడుతుంది
9 స్కెన్ జెన్ 26 యూరప్ దేశాల ట్రావెల్ ఇన్సూరెన్స్ : దీనినే యూరప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటారు ఇందులో మొత్తమ్ 26 యూరోపియన్ దేశాలు ఉంటాయి ఈ దేశాల్లో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా ప్రయాణ బీమా అవసరం
10 సింగిల్ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ : సింగిల్ ట్రిప్ అనగా ఒకే ప్రయాణం కోసం ఏర్పడు చేయబడ్డ పాలసీ
11 మల్టీ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ : తరచుగా విదేశీ పర్యటనలు చేసే వారి కోసం ప్రతి సారి ఇన్సూరెన్స్ కొనుగోలు చేయకుండా ఈ పాలసిఉపయోగ పడుతుంది
ట్రావెల్ ఇన్సూరెన్స్ లో కవర్ చేయబడే అంశాలు :
1 విదేశి ప్రయాణాల్లో ఉన్నపుడు అనారోగ్యం పాలవడం లేదా అనుకోని రోడ్డు ప్రమాదాలు ఎదురైతే మానసికంగా కృంగిపోవటమే కాకుండా ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ప్రయాణ బీమా మీకు నగదు రహిత వైద్య సదుపాయం కల్పిస్తుంది
2 విదేశీ పర్యటనలో ఉన్నపుడు దురదృష్టవశాత్తు మరణిస్తే మృతదేహాన్ని స్వదేశానికి తీసుకవస్తుంది
3 మీరు ప్రయాణిస్తున్న విమానం ఆలస్యం లేదా రద్దు కావచ్చు అలాంటప్పుడు ప్రయూణ బీమా ఆ ఆర్ధిక నష్టాన్ని పురిస్తుంది
4 విలువైన వస్తువులతో కూడిన బ్యాగేజి దెబ్బతినటం లేదా తప్పిపోవటం జరగవచ్చు అలాంటి ఆర్ధిక నష్టాలను ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది
5 ఏదేని సహస క్రీడలల్లో పాల్గొని ఏదిని ప్రమాదం ఏర్పడితే ప్రయాణ బీమా ఆసుపత్రి ఖర్చులను కవర్ చేస్తుంది
6 మీ ప్రయాణ పొడగింపు కారణంగా అత్యవసర వసతి సౌకర్యం ప్రయాణ బీమా కల్పిస్తుంది
7 విదేశీ ప్రయాణాల్లో ప్రమాద కారణంగా మీ వళ్ళ ఇతరులకు అయ్యే శారీరక గాయాలు ఆస్తి నష్టం లాంటి చట్టపరమైన సమస్యలనుండి మీ తరుపున వ్యక్తిగత లయబిలిటీ మరియు బెయిల్ బాండ్ ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది
8 మీ ప్రయాణాల్లో మీ నగదు కోల్పోవటం లేదా దొంగిలించబడటం జరిగితే ప్రయాణ బీమా మీకు ఎమర్జెన్సీ క్యాష్ ని అందిస్తుంది
9 మీరు విదేశాల్లో ఏదేని స్పామ్ లకు గురైతే మీకు రక్షణ కల్పిస్తుంది
ట్రావెలిన్స్యూరెన్సు లో కవర్ చెయ్యని అంశాలు :
1 డాక్టర్ సలహాకు విరుద్ధంగా ప్రయాణం లేదా ముందునుండి ఉన్న వ్యాధుల కారణంగా వచ్చే ఖర్చులను కవర్ చెయ్యదు
2 ఆల్కహాల్,డ్రగ్స్ మత్తు పదార్థాల కారణంగా ఎదురయ్యే క్లెయిమ్స్ ని కవర్ చెయ్యదు
3 స్వీయ గాయాలు లేదా ఆత్మహత్య ఆత్మహత్య ప్రయత్నం లాంటివి కవర్ చెయ్యబడవు
4 దొంగతనం నేరం చట్టవ్యతిరేక కార్యక్రమాల కారణంగా వచ్చే క్లెయిమ్స్ ని కవర్ చెయ్యవు
5 గర్భం,ప్రసవం ,లైంగిక వ్యాధులు ,STD ,మానసిక రుగ్మతల కారణంగా అయ్యే నష్టాలను కవర్ చెయ్యదు
6 కాస్మొటిక్ ప్లాస్టిక్ సర్జరీలు ప్రత్యాన్మాయ చికిస్థలయిన హోమియో,నాచురోపతి,ఆయుర్వేదం వంటివి కవర్ చెయ్యబడవు
7 తోడు లేకుండ సామాను విడిగా వచ్చే బ్యాగేజి నష్టాలను,పాలసీలో పేర్కొన్న బౌగోలీక ప్రాంతం అవతల పోయిన బ్యాగేజీలను కవర్ చెయ్యదు
8 విమాన సంస్థ 6 గంటల ముందే విమాన ఆలస్యం గురించి తెలియజేసిన ,కస్టమ్స్ డిపార్ట్మెంట్ వళ్ళ ఆలస్యం వళ్ళ జరిగే నష్టాలను కవర్ చెయ్యదు
9 వీసా తిరస్కరన కారణంగా ట్రిప్ రద్దయితే కవర్ చెయ్యదు
10 వినోద సహస క్రీడలు ఒక్కరోజు వరకు మాత్రమే కవర్ చేస్తాయి
11 మీరు పర్యటిస్తున్న దేశంలో ఉగ్రవాద చర్యలు,యుద్ధం అంతర్యుద్ధం లాంటి కారణంగా కవర్ చెయ్యబడవు
ప్రయాణ బీమా ప్రీమియంను ప్రభావితం చేయు అంశాలు :
1 ప్రయాణం చేయనుకున్న దేశం : ప్రయాణ బీమా ను ప్రభావితంచేయు అంశాల్లో మనం ప్రయాణిస్తున్న దేశం ప్రభావితం చేస్తుంది ఏదేని ఎక్కువ రిస్క్ ఉన్న దేశంలో ప్రయాణంచేయనుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాలి
2 ప్రయాణ కాల వ్యవధి : ఎక్కువ రోజులు ప్రయాణం చేయాలనుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది
3 ప్రయాణికుల సంఖ్య : ఎంత మంది సభ్యులు ప్రయాణం చేస్తున్నారో వారి సంఖ్యని బట్టి ప్రీమియం ఆధారపడి ఉంటుంది
4 ఆడ్ -ఆన్ – కవర్స్: ఎంచుకొనే అదనపు కవర్స్ ని బట్టి ప్రీమియం పెరిగే అవకాసహం ఉంది
ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ :
క్లెయిమ్ ప్రాసెస్ కోసం ఎటువంటి పేపర్ వర్క్ అవసరం లేదు. పాలసీలో కవర్ అయ్యే క్లెయిమ్స్ అన్నింటిటి మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు క్లెయిమ్స్ కోసం అవసరమయ్యే అన్ని డాకుమెంట్స్ ని మెయిల్ చేసి పరిహారం పొందవచ్చు .