TERM INSURANCE – Telugu Policy
TERM INSURANCE – ఏ వ్యక్తి కూడా ఈ ప్రపంచంలోకి వొంటరిగా రాడు అతనికి తల్లిదంద్రులతో పాటు భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళ సంరక్షణ, పోషణ,పిల్లల చదువులు లాంటి అనేక బాధ్యతలుంటాయి ఈ క్రమంలో తను అకాల మరణం చెందితే ఆ కుటుంభం రోడ్డున పడాల్సి వస్తుంది అలాగే మీరు మీ కుటుంబ బాధ్యతల్లో భాగంగా తీసుకున్న అప్పు కానీ వ్యక్తిగత,బ్యాంకు రుణాలు గాని తీర్చాల్సిన భారం మీరు లేకపోయినా మీ కుటుంబంపై పడుతుంది మీరు లేని లోటు ఎటూ తీర్చలేనిది కానీ ఆర్థిక పరమైన సమస్యలనుండి మీ కుటుంబాన్ని కాపాడుకోవటానికి “జీవిత బీమా” తీసుకున్నట్లయితే పాలసీధారుడు అకాల మరణం చెందితే వారి కుటుంబానికి జీవిత బీమా ఆర్థిక ప్రయోజనం అందిస్తుంది.అలాగే మరణ ప్రయోజనంతో పాటు పొదుపు,పెట్టుబడి పథకాలు, పిల్లల చదువుల నిమిత్తం చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ,రిటైర్మెంట్ ప్లాన్స్ లాంటి ఎన్నో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వాటిని గురించి తెల్సుకుందాం
సాధారణంగా జీవిత బీమాను రెండు రకాలుగా విభజించవచ్చు
1) మరణ ప్రయోజనంతో కూడిన జీవిత బీమా ఒకటైతే
2) మరణ ప్రయోజనాలతో పాటు పొదుపు,పెట్టుబడి ప్రణాళికలతో కూడిన జీవిత బీమా రెండోది
మొత్తంగా భారతదేశంలో 9 రకాల పాలసీలు ఉన్నాయి అవి:
1-టర్మ్ ఇన్సురెన్సు పాలసీ
2-టర్మ్ రిటర్న్ పాలసీ (TROP)
3-హోల్ లైఫ్ పాలసీ
4-ULIPS – పాలసీలు
5-ఎండోమెంట్ పాలసీ
6-మనీ బ్యాక్ పాలసీ
7-రిటైర్ మెంట్ /పెన్షన్ పాలసీ
8-చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ
9-గ్రూప్ ఇన్సు రెన్సు పాలసీ
వీటిని గురించి వివరంగా తెల్సుకుందాం
1 టర్మ్ ఇన్సురెన్స్
జీవిత బీమా పాలసీలన్నింటిలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాథమికమైనది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణను అందిస్తుంది అందుకే దీన్ని “ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్” అంటారు. పాలసీ వ్యవధిలో బీమా దారుడు అకాల మరణం చెందినట్లయితే మరణ ప్రయోజనాలను అందిస్తుంది అయితే పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం ఈ పాలసీలో ఎటువంటి ప్రయోజనాలను పొందడు అయితే కొన్ని రైడర్లు ఎంచుకోవడం వల్ల క్రిటికల్ ఇల్నెస్ యాక్సిడెంట్ డిజబులిటీ లాంటి ప్రయోజనాలను పొందవచ్చు.
2 టర్మ్ రిటర్న్ పాలసీ (TROP)
అనగా టర్మ్ ఇన్సూరెన్స్ లాగే పాలసీదారుడు అకాల మరణానికి గురైనప్పుడు మరణ ప్రయోజనంతో పాటు రైడర్ ప్రయోజనాలను పొందుతాడు కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ కి దీనికి గల తేడా ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ లో పాలసీదారుడు మరణించక పోతే ప్రీమియం వెనక్కి రాదు ,కానీ ఇందులో మొత్తం ప్రీమియం తిరిగి పాలసీదారుడుకి మెచ్యూరిటీ రూపంలో చెల్లించబడుతుంది.
3 హోల్ లైఫ్ ఇన్సూరెన్స్
పాలసీ పేరుకు తగ్గట్టే పాలసీదారుడు జీవించి ఉన్నంతకాలం పాలసీ ప్రయోజనాలను పొందుతాడు అలాగే ఈ పాలసీలో జీవిత బీమా రక్షణతో పాటు పొదుపు పెట్టుబడి ప్రయోజనాలను కలిగి ఉంటుంది అలాగే పాలసీదారుడు కొంత కాల పరిమితి తర్వాత తాను కట్టిన ప్రీమియంలపై రుణం పొందే అవకాశం ఉంటుంది.
4 యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ (ULIP)
ఈ పాలసీ జీవిత బీమా కవర్ తో పాటు పొదుపు,పెట్టుబడి సంపదవృద్ధి లాంటి అదనపు ప్రయోజనాలతో కూడుకొని ఉన్నది. ఇందులో పాలసీదారుడు ప్రీమియం రూపంలో కడుతున్న డబ్బుని వివిధ పెట్టుబడి సాధనాల్లో పెట్టి లాభంతోపాటు ఈ బీమా మొత్తాన్ని మరణం లేదా మెచ్యూరిటీ సమయంలో తిరిగి పొందవచ్చు.
5 ఎండోమెంట్ ఇన్సూరెన్స్ పాలసీ
పెద్ద మొత్తంలో పొదుపు చేయాలని కోరుకునే పాలసీదారులకు ఎండోమెంట్ ప్లాన్లు ఉత్తమమైనవి. వీటిలో ఒకవైపు పొదుపు మరోవైపు బీమా అనే రెండు ప్రయోజనాలు కలిగి ఉన్నది పాలసీదారుడు అకాల మరణం చెందుతే నామినీకి మరణ ప్రయోజనం చెల్లించబడతాయి లేదా ప్లాన్ మెచ్యూరిటీ తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో మెచ్యూరిటీ ప్రయోజనం పొందవచ్చు.
6 మనీ బ్యాక్ పాలసీ
ఈ పాలసి స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఒకవేళ పాలసీదారుడు అకాల మరణం చెందితే నామినీకి మరణ ప్రయోజనాలు చెల్లించబడతాయి. ఒకవేళ మరణం సంభవించనిచో మెచ్యూరిటీ ప్రయోజనంతో ఒకేసారి మొత్తం చెల్లింపును అందుకుంటాడు.
7 రిటైర్మెంట్ పెన్షన్ పాలసీ
పాలసీదారుడు పదవి విరమణ అనంతరం స్థిరమైన మరియు విశ్వసనీయమైన నెలవారి చెల్లింపులు ఈ పాలసీ ద్వారా అందించబడుతుంది. ఈ పాలసీలో కూడా మరణ ప్రయోజనంతో పాటు నెల నెల పింఛన్ రూపంలో పాలసీదారుడికి అందిస్తూ, తను వృద్ధాప్యంలో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది తద్వారా పదవి విరమణ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడానికి తోడ్పడుతుంది.
8 చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ
పాలసీదారుడు లేదా తల్లిదండ్రులు అకాల మరణం సంభవించినప్పుడు వారి పిల్లల ఉన్నత విద్య మరియు వివాహం లాంటి భవిష్యత్ ప్రణాళికలకు ఈ పాలసీ సహాయపడుతుంది ఈ పాలసీలో మీ పిల్లల కోసం పొదుపు మరియు పెట్టుబడి ప్రణాళికలతో సహాయపడుతుంది.
9 గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ
ఈ పాలసీ సమూహానికి లేదా ముఖ్యంగా కంపెనీ ఉద్యోగులకు జీవిత బీమాను మరియు ఆర్థిక భద్రత కోసం కల్పించడం జరిగింది. దీంతోపాటు క్లిష్టమైన అనారోగ్య సమస్యలు అంగవైకల్యానికి ఆర్థిక పరిహార ప్రయోజనాలు కల్పించబడ్డాయి
జీవిత బీమా ప్రయోజనాలు :
1 మరణ ప్రయోజనం : ఏదేని దురదృష్ట సంఘటన జరిగి పాలసీదారుడు అకాల మరణం చెందినట్లయితె వారిపై ఆధారపడిన వారి కుటుంబానికి ఏక మొత్తంలో ఆర్ధిక పరిహారాన్ని అందించి వారి కుటుంబానికి అండగా ఉంటుంది
2 క్రిటికల్ ఇల్ నెస్ : జీవిత బీమా మరణ ప్రయోజనంతో పాటు ఏదేని ప్రమాదంలో అంగ వైకల్యం ఏర్పడిన, అనుకోకుండా వచ్చే ప్రాణాంతక వ్యాధులకు బాధిత పాలసీదారునికి ఆర్ధిక పరిహారాన్నిఅందించి వారి కుటుంబాన్ని ఆదుకుంటుంది.
3 మెచూరిటీ ప్రయోజనం : జీవిత బీమా లైఫ్ కవర్ తో పాటు ప్రీమియం రూపంలో కట్టిన ప్రతి రూపాయికి అదనపు ప్రయోజనాలను మెచూరిటీ రూపంలో అందిస్తుంది
4 గ్యారెంటెడ్ రిటర్న్స్ : జీవిత బీమా సంస్థలో పెట్టిన ప్రతి పెట్టుబడికి పాలసీ సంస్థ ఇచ్చిన హామీ మేరకు కచ్చితమైన విశ్వసనీయమైన గ్యారెంటెడ్ రిటర్న్స్ అందుతాయి.
5 సంపద సృష్టి : జీవిత బీమా సంస్థ సంపద సృష్టికి సంబంధించిన ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాయి. పాలసీదారుడు కట్టిన ప్రీమియంలను అధిక లాభాలు వచ్చే పెట్టుబడి సాధనాల్లో పెట్టి బీమా సంస్థ ఇచ్చిన హామీ మేరకు సంపదకు హామీ ఇస్తుంది.
6 రుణ సౌకర్యం : జీవిత బీమా సంస్థ పాలసీదారుల ఊహించని ఖర్చులు లేదా ఆర్ధిక అత్యవసరాల కోసం రుణ సౌకర్యాన్ని కల్పిస్తుంది
7 పదవి విరమన ప్రణాళిక : వృధాప్యంలో లేదా పదవి విరమణ అనంతర జీవితాన్ని ఆస్వాదించడానికి స్వతంత్ర ఆర్ధిక భద్రతకు జీవిత బీమా పాలసీలు నెల నెల పింఛన్ రూపంలో అందించే ప్రణాళికలు కల్గి ఉంటాయి.
8 పిల్లల భవిషత్ ప్రణాళికలు : జీవితబీమా పాలసీలో పాలసీదారుడు తమ పిల్లల కోసం ఉన్నత విద్య వివాహం లాంటి భవిష్యత్ అవసరాల కోసం పొదుపు ప్రణాళికలను కలిగివుంది.
9 రైడర్స్ : జీవితబీమా పాలసీలో రైడర్ లు విభిన్న ప్రయోజనాలను అందిస్తాయి పాలసీదారుని అవసరాలను బట్టి రైడర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. పాలసీదారుడు ఏదేని రిస్క్ కు గురైతే ప్రీమియం మిహాయింపు ప్రయోజనం పొందవచ్చు
10 పొదుపులను ప్రోత్సహిస్తుంది : జీవిత బీమా పాలసీలు ప్రీమియం కోసం పాలసీదారుడు కచ్చితంగా పొదుపు చేస్తాడు కావున పొదుపును ప్రోస్తహించేలా పాలసీలు తోడ్పడుతాయి
11 మనశ్శాంతిని ఇస్తుంది :జీవిత బీమా మీ రోజు వారి కార్యక్రమాల్లో మీకు మీ కుటుంబానికి రక్షణ కవచంలా ఉంటుంది కావున ఏదేని అనుకొని ప్రమాదం వచ్చిన కలత చెందకుండా ప్రశాంతంగా ఉండవచ్చు
12 పన్ను ప్రయోజనాలు : జీవిత బీమా కోసం చెల్లించే ప్రీమియంలకు మరియు క్లెయిమ్ సమయంలో వచ్చే ఆర్ధిక ప్రయోజనాలకు పన్ను మినహాయింపు ఉంటుంది
జీవిత బీమాను ప్రభావితంచేసే అంశాలు :
1.వయస్సు : చిన్న వయసు వారికి తక్కువ ప్రీమియం , వయస్సు పెరుగుతున్న కొద్దీ ప్రీమియం పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్ది అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశంతో పాటు జీవితకాలం తగ్గుతుంది కావున బీమా సంస్థలు ప్రీమియంలు పెంచుతాయి
2 జెండర్ : ఒకే వయస్సు గల స్త్రీ,పురుషులకు ప్రీమియం వేరువేరుగా ఉంటుంది స్త్రీలకు పురుషులకన్నా ప్రీమియం తక్కువగా ఉంటుంది.ఎందుకంటే స్త్రీల జీవన శైలి పురుషుల జీవన శైలి కంటే మెరుగ్గా ఉండటం, స్త్రీల ఆయుర్ధాయం పురుషులకన్నా ఎక్కువగా ఉండటం దీనికి కారణం
3 వైద్యచరిత్ర : వ్యక్తుల వైద్య చరిత్ర ప్రీమియంను ప్రభావితం చేస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలులేని వ్యక్తికి తక్కువ ప్రీమియం ఏవేని దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్న వ్యక్తికి ఎక్కువ ప్రీమియం వసూలు చెయ్యబడుతుంది
4 జీవన శైలి అలవాట్లు : మధ్య పానం, ధుమ పానం చేసే వ్యక్తులకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది అలాగే సాహస క్రీడలు, ప్రమాదకర వినోద క్రీడలలో పాల్గొనే వారి ప్రీమియం కూడా ఎక్కువగాను ఉంటుంది
5 వృత్తి : సురక్షితమైన ప్రదేశాల్లో పనిచేస్తున్న లేదా నివసిస్తున్న వ్యక్తులకు ప్రీమియం తక్కువగాను కొండా ప్రాంతాల్లో మరియు మైనింగ్ వంటి ప్రమాదకర వృత్తిని చేస్తున్న వ్యక్తులకు ప్రీమియం ఎక్కువగాను ఉంటుంది
జీవిత బీమాను ఎంచుకొనే ముందు పరిగణించాల్సిన అంశాలు :
1) క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో (CSR ) : అనగా బీమా సంస్థ ఎన్ని క్లెయిమ్స్ ని పరిష్కరించిందో చెప్పే నివేదిక. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటె సంస్థ విశ్వసనీయత అంత మెరుగ్గా ఉంటుంది. 90% శాతం లేదా అంతకన్నా ఎక్కువ రేషియో ఉన్న సంస్థను ఎంకుకోవటం మంచిది.
2) సాల్వెన్సీ రేషియో : మంచి సాల్వెన్సీ రేషియో అనేది బీమా సంస్థ యొక్క ఆర్ధిక సామర్ధ్యాన్ని, పాలసీదారుల అవసరాలు తీర్చడంలో సంస్థ పనితీరును సూచిస్తుంది. కనీసం 1.5 సాల్వెన్సీ రేషియో ఉన్న బీమా కంపెనీ నుండి పాలసీ తీసుకోవటం మంచిది
3) బీమా సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM ): సంస్థ ప్రతి సంవత్సరం యొక్క ఆస్తులను ,ఆర్ధిక నిల్వలను సూచిస్తుంది మార్కెట్లో ఎక్కువ ఆస్తులు ఉన్న సంస్థను ఎంచుకోవటం ముఖ్యం
4) రైడర్స్- యాడ్-ఆన్స్ : జీవిత బీమా కావర్ తోపాటు అంగ వైకల్యం,గాయాలు,టెర్మినల్ ఇల్ నెస్ ,క్రిటికల్ ,ఇల్ నెస్, విద్య చికిత్సకు ఆర్ధిక పరిహారం ,ప్రీమియం మినహాయింపు లాంటి ఎన్నో అదనపు ప్రయోజను ఉన్న పాలసీ రైడర్ లను ఎంచుకోవటం మంచిది
జీవిత బీమాను కొనుగోలు చెయటంలో చేయకూడని తప్పులు :
1 తప్పుడు వివరాలు ఇవ్వవద్దు : బీమా సంస్థకు పాలసీ కోసం చెప్పే వివరాలు తప్పుగా చెప్పకూడదు తప్పుడు వివరాలతో కూడిన పాలసీ క్లయిమ్స్ సమయంలో తిరస్కరించ బడుతుంది
2 జీవన శైలి వివరాలు దాచకూడదు : మధ్యపాణం ,ధుమపాణం లాంటి అలవాట్లను పాలసీ తీసుకునేటప్పుడు తప్పకుండ తెలియ జేయాలి ప్రీమియం తగ్గుదల కోసం వివరాలు దాచవద్దు ఎందుకంటే పాలసీ క్లెయిమ్ కాదు.
3 వైద్య చరిత్ర : వ్యక్తిగత,కుటుంభం వంశపారంపర్యంగా సంక్రమించిన వ్యాధులను లేదా ఏదేని తీవ్రమైన వ్యాధితో లేదా గతంలో ఉన్న వ్యాధులను దాచకూడదు
4 ప్రీమియం చెల్లింపులు మిస్ చెయ్యకూడదు : మీకు మీ కుటుంబానికి రక్షణనిచ్చే జీవిత బీమా ప్రీమియంలు క్రమం తప్పకుండ కట్టనిచో పాలసీ లాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది
జీవిత బీమా కవర్ చెయ్యని అంశాలు :
ఆత్మహత్య కారకం : పాలసీ తీసుకున్న మొదటి సంవత్సరంలో పాలసీదారుడు ఆత్మహత్య చేసుకుంటే పాలసీ క్లెయిమ్ తిరస్కరించబడుతుంది
ముందుగా ఉన్న అనారోగ్య కారకం : ఎయిడ్స్, HIV ,STD వంటి వ్యాధుల వాళ్ళ మరణిస్తే క్లెయిమ్ రాదు
ప్రమాదకర చర్యల కారకం : ప్రమాదకరమైన ఆటలు సాహస క్రీడలు వంటి చర్యలలో పాల్గొని ప్రమాదం సంభవించినచో క్లెయిమ్ రాదు
మద్యం మత్తు కారకం : విపరీతంగా మద్యం సేవించడంతో మరణం సంభవిస్తే క్లెయిమ్ తిరస్కరించబడుతుంది అలాగే మధ్య మత్తులో వాహనం నడపడం వళ్ళ సంభవించే ప్రమాదాలు తిరస్కరించబడుతాయి
చట్ట విరుద్ధ చర్యల కారకం : చట్ట విరుద్ధ కార్యక్రమాల వల్ల ఏదేని ప్రమాదం సంభవిస్తే పాలసీ కవర్ చేయబడదు
హత్య కారకం: పాలసీదారుడు ఈ రెండు పరిస్థితుల్లో హత్యకు గురైతే క్లెయిమ్ తిరస్కరించబడుతుంది
1-నామినినే హత్య చేయటం లేదా చేయించడం
2-చట్ట వ్యతిరేక చర్యలో పాలసీదారుడు హత్యకు గురవ్వటం
జీవిత బీమా కవరేజిని ఎంచుకొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు : మీకు మీ కుటుంభం అవసరాలకు ఎంత మేరకు బీమా అవసరమో తెలుసుకోవటానికి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి అవి…..
1 మీ కుటుంభం అవసరాలు ; కుటుంభ రోజు వారి అవసరాలు ఒక్కో కుటుంబానికి ఒక్కో విధంగా ఉంటాయి మీ మొత్తం ఆదాయం మరియు మొత్తం ఖర్చులను అంచనా వేయండి మీరు లేని సమయంలో మీ కుటుంభం అవసరాలు తీర్చటానికి ఎంత మేరకు అవసరం పడుతాయో అంచనా వేసి అంత మేరకు కవర్ తీసుకోండి
2 HLV సూత్రం ; దీన్నే మానవ జీవిత విలువ సూత్రం అంటాం . ఇది ఎం చెపుతుందంటే ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం నుండి సంవత్సర ఖర్చులు తీసివేయ్యగా వచ్చిన మిగులును ఆధారం చేసుకొని ఆ మిగులు మొత్తానికి 100 రేట్లు ఎక్కువ బీమా చెయ్యాలని చెపుతుంది
3 రుణాలు మరియు అప్పులు :మీరు మీ కుటుంభం అవసరాలకు లేదా వ్యాపార అవసరాలకు ఎంత మేరకు అప్పులు తీసుకున్నారో వాటిని పరిగణలోకి తీసుకొని బీమా చేయండి
4 మెడికల్ ఎమర్జెన్సీ : మీరు ఊహించని ఏదేని అనారోగ్య పరిస్థితి వస్తే వైద్యం పరంగా దాన్ని ఎదుర్కోవటమే కాకుండా మీ కుటుంభ రక్షణకు ఎంత మేరకు అవసరమో అంచనా ప్రకారం బీమా చెయ్యండి
5 జీవిత దశలు : యుక్త వయస్సు ,యవ్వనం ,వృద్యాప్యం లాంటి జీవిత దశలలో ఎంత మేరకు ఆర్ధిక అవసరాలు ఉంటాయో అంచనా వేసి అంత మేరకు పాలసీ కవర్ తీసుకోవాలి
జీవిత బీమా అర్హతలు : పాలసీ కొనుగోలుకు కనీస వయస్సు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 65 లేదా కోన్నీ బీమా సంస్థలు 70 వరకు ఇస్తున్నాయి అలాగే యువకులు,పిల్లలకోసం తల్లిదండులు ,భార్యాభర్తలు వారి భాగస్వామి కోసం గృహిణులు ,స్వయం ఉపాధి గల వారు NRI లు కూడా జీవిత బీమా పాలసీ తీసుకోవటానికి అర్హులు
జీవిత బీమా రైడర్స్: పాలసీ బేస్ ప్లాన్ తో పాటు కవరేజిని పెంచుకోవటానికి అదనపు లేదా ప్రత్యేక ప్రయోజనాల కోసం రైడర్స్ ని ఎంచుకోవచ్చు అవి ….
1 ఆక్సిడెంటల్
2 ఆక్సిడెంటల్ డిసబిలిటీ
3 క్రిటికల్ ఇల్ నెస్ రైడర్
4 టర్మినల్ ఇల్ నెస్ రైడర్
5 హాస్పికెర్ రైడర్
6 ప్రీమియం వేవియర్ రైడర్
7 సర్జికల్ కేర్ రైడర్
8 ఇన్ కమ్ బెన్ఫిట్ రైడర్డెత్ రైడర్
మన అవసరాలు, స్థోమత,నిబంధనలు షరతుల మేరకు రైడర్ లను ఎంచుకోవటం ఉత్తమం.
జీవిత బీమాను ఎలా క్లెయిమ్ చెయ్యాలి :
క్లెయిమ్ ఇంటిమెషన్ ; ముందుగా ఏదెనీ ప్రమాదం సంభవించిన వెంటనే సంబంధిత బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. IRDAI నిబంధనల ప్రకారం ఇంటిమెటిన్ ఇచ్చిన తేది నుండి 30 రోజుల్లోగా బీమా సంస్థ క్లెయిమ్ ను పరిష్కరించాల్సి ఉంటుంది .చాల బీమా సంస్థలు మరింత చురుకుగా ఈ లోపే పూర్తి చేస్తాయి. ఆ తర్వాత ప్రమాదానికి సంబంధించిన అవసరమైన డాకుమెంట్స్ ని బీమా సంస్థ ఆఫీసులోగాని లేదా ఆన్ లైన్ లోగాని సమర్పించాల్సి ఉంటుంది
క్లెయిమ్స్ కి కావాల్సిన డాక్యూమెంట్స్ :
1 దావా (CLAIM ) ఫారమ్ ను పుర్తిగా నింపాల్సి ఉంటుంది
2 పాలసీ ఒరిజినల్ డాక్యుమెంట్
3 మెడికల్ రిపోర్ట్స్ ( అడ్మిషన్ నోట్స్ ,డెత్ లేదా డిశ్చార్జ్ సమ్మరీ ,టెస్ట్ రిపోర్ట్స్ )
4 పోస్టుమార్టన్ రిపోర్ట్
5 డెత్ సర్టిఫికెట్
6 నామిని ఫోటో,పాన్ కార్డు లేదా ఆధార్ కార్డ్
F.A.Q