మీరు ఒక మంచి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడానికి ముందు రెండు విషయలు పరిగణలోకి తీసుకోవాలి అది బీమా సంస్థకు సంబంధించిన చెక్ లిస్ట్ ఒకటైతే రెండోది పాలసీకి సంబంధించిన చెక్ లిస్ట్. రెండిటిని పరిగణలోకి తీసుకొని మంచి పాలసినీ ఎంచుకోవటం కోసం ఈ గైడ్ ని రూపొందించడం జరిగింది.
బీమా సంస్థ యొక్క చెక్ లిస్ట్ : ఒక బీమా సంస్థను ఎంచుకొనే ముందుగా ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీని పరిగణలోకి తీసుకోని ఈ క్రింది వాటిని పరిశీలించాలి
1) క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో (CSR ) : అనగా బీమా సంస్థ ఎన్ని క్లెయిమ్స్ ని పరిష్కరించిందో చెప్పే నివేదిక. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటె సంస్థ విశ్వసనీయత అంత మెరుగ్గా ఉంటుంది. 90% శాతం లేదా అంతకన్నా ఎక్కువ రేషియో ఉన్న సంస్థను ఎంకుకోవటం మంచిది. సగటున 3 సంవత్సరాలు మరియు గడచిన 30 రోజుల సెటిల్మెంట్ నిష్పత్తిని పరిగణలోకి తీసుకుంటే రెండు 97% కంటే ఎక్కువ ఉంటె మంచి సంస్థగా చెప్పవచ్చు ఈ నివేదికలు ప్రతి సంవత్సరం IRDAI లో చూడవచ్చు
2) క్లెయిమ్ రిజెక్షన్ రేషియో : ఇది ఎంత తక్కువగా ఉంటె బీమా సంస్థ యొక్క విశ్వసనీయత అంత మెరుగ్గా ఉంటుంది .ఏదేని కారణం చేత క్లెయిమ్స్ నిరాకరించిన బడిన క్లెయిమ్స్ మొత్తాన్ని క్లెయిమ్స్ రిజెక్షన్ రేషియో అంటారు ఇది 1% కన్నా తక్కువ ఉన్న సంస్థను ఎంచుకోవటం ఉత్తమం.
3) అమౌంట్ సెటిల్మెంట్ రేషియో : బీమా సంస్థలు ఎంత అమౌంట్ ని సెటిల్ చేశాయో కూడా పరిగణలోకి తీసుకోవాలి.చిన్న క్లెయిమ్స్ సెటిల్ చేసి పెద్ద క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తే ఆ సంస్థ ఎంపిక చేసుకోకపోవటం మంచిది
4) కంప్లయెంట్స్ రేషియో : ఒక బీమా సంస్థకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఆ సంత పనితీరు బాగా లేదు అన్నమాట వీటిని మనం IRDAI నివేదికలో చూసుకోవచ్చు
5) సాల్వెన్సీ రేషియో : మంచి సాల్వెన్సీ రేషియో అనేది బీమా సంస్థ యొక్క ఆర్ధిక సామర్ధ్యాన్ని, పాలసీదారుల అవసరాలు తీర్చడంలో సంస్థ పనితీరును సూచిస్తుంది. కనీసం 1.5 సాల్వెన్సీ రేషియో ఉన్న బీమా కంపెనీ నుండి పాలసీ తీసుకోవటం మంచిది
పాలసీకి సంబంధించిన చెక్ లిస్ట్ : ఒక మంచి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈ ప్రయోజనాలు తప్పకుండ ఉండాలి
1 టర్మ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ విత్ జీరో కాస్ట్ : కొన్ని బీమా సంస్థలు టర్మ్ ఇన్సూరెన్స్ 60,లేదా 70, సంవత్సరాలకు తీసుకున్నప్పటికీ అంతకు ముందే పాలసీ వదులుకున్నట్లయితే బీమా సంస్థలు మీరు కట్టిన అన్ని ప్రీమియంలు GST మినహాయించి తిరిగి ఇచ్చేస్తాయి ఇది ఒక్కో బీమా సంస్థ ఒక్కో విధమైన నిబంధనలను పాటిస్తుంది. ఇది కూడా పురే టర్మ్ పాలసీనే ప్రీమియం కూడా టర్మ్ పాలసీలో ఎంత ఉంటుందో అంతే ఉంటుంది
2 ప్రీమియం మినహాయింపు రైడర్ : పాలసీదారుడికి ఏదేని ప్రమాదం,లేదా అనారోగ్యం సంభవించి పని చెయ్యని పరిస్థితిలో ఉంటే ప్రీమియం మాఫీ చేసి పాలసీ ఇచ్చిన హామీ మేరకు లైఫ్ కవర్ తో పాటు పాలసీ ప్రయోజనాలు అన్ని అందించ బడుతాయి. ఇవి కొన్ని కొన్ని బీమా సంస్థలు ఉచితంగా కొన్ని అదనపు ప్రీమియంతో అందిస్తాయి
3 క్రిటికల్ ఇల్ నెస్ రైడర్ : గుండె జబ్బులు ,కాన్సర్ శరీర అవయవాలు దెబ్బతినటం లాంటి ప్రాణాంతకర వ్యాధుల నుండి ఈ రైడర్ కాపాడుతుంది ఒక్కో పాలసీ ఒక్కో విధమైన వ్యాదులు కవర్ చేస్తాయి కొన్ని పాలసీలు 30 రకాల వ్యాధులను కొన్ని పాలసీలు 60 కి పైగా వ్యాధులను కవర్ చేస్తాయి ఈ రైడర్ కొన్ని పాలసీలలో ఫ్రీ ఆడ్ ఆన్ గాను కొన్ని ప్రీమియంతో ఎంచుకోవాల్సి వస్తుంది ఎంచుకొనే ముందు మీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంచుకోవాల్సి ఉంటుంది
4 యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబులిటీ రైడర్ : ఏదేని ప్రమాదంలో మరణించినట్లయితే జీవిత బీమా కవర్ తో పాటు ఈ రైడర్ అదనంగా వారి కుటుంబానికి అదనపు ప్రయోజనం చేకూరుస్తుంది దీనికి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది రోజు ప్రయాణాలు లేదా రిస్క్ తో కూడిన జీవన శైలి ఉన్న వ్యక్తులకు ఉపయోగ పడుతుంది.అలాగే ఈ రైడర్ లో మరణ ప్రయోజనంతొ పాటు ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం లేదా పాక్షిక అంగ వైకల్యం ఏర్పడితే కూడా పాలసీలో పేర్కొన్న విధంగా ఆర్ధిక ప్రయోజనంతో పాటు ప్రీమియం మినహాయింపుతో పాటు జీవితబీమా కవర్ చెయ్యబడుతుంది
5 టెర్మినల్ ఇల్ నెస్ రైడర్ : ఈ రైడర్ ఉన్నట్లయితే పాలసీ మనుగడలో ఏదేని ప్రాణాంతక వ్యాధి నిర్ధారణ అయినట్లయితే బీమా సంస్థ పాలసీలో ఇచ్చిన హామీ మేరకునేరుగా ఆర్ధిక ప్రయోజనాన్ని అందిస్తుంది
6 జీవితబీమా కవర్ టాప్-అప్ సౌకర్యం : పెరుగుతున్న ద్రవోల్బణం ఆధారంగా పాలసీ కవర్ కూడా పెరిగే సౌకర్యాన్ని ఎంచుకోవటం మంచింది అలాగే వివిధ జీవిత దశల్లో వివాహం ,పిల్లలు వంటి బాధ్యతలు పెరుగుతున్న కొద్ది కవర్ పెరిగే మంచి పాలసీని ఎంచుకోవటం ఉత్తమం
జీవిత బీమాను ఎంచుకొనే ముందు పాలసీదారులు ఈ తప్పులు అస్సులు చేయకూడదు
1- పాలసీ కవర్ ని ఎంచుకొవాటంలో తప్పులు చెయ్యకూడదు. మన అర్హతకు మించి గాని అవసరాలకు తక్కువ గాని కవర్ తీసుకోకూడదు (HLV) మానవ జీవిత విలువ సూత్రం ప్రకారం గాని లేదా మన సంవత్సర ఆదాయానికి 10 నుండి 15 రెట్లకు గాని మించకూడదు
2- పాలసీ ప్రపోసల్ ఫారాన్ని స్వయంగా నింపడం మంచిది లేదా వీలుకాకపోతే కచ్చితంగా పరిశీలించాలి
3- మధ్య పానం ధూమపానం అలవాట్లు ముందుగా ఉన్న వ్యాధులను తప్పకుండ తెలియజేయాలి
4- MWP ఆక్ట్ ని ఎంచుకొనే ముందు ఒకటికి రెండు సార్లు పన : పరిశీలించుకోవాలి ఎందుకంటే నామిని మార్చినట్టు దీన్ని మార్చలేము
5- గతంలో పాలసీ ఉండి రెండో పాలసీ తీసుకుంటే పాత పాలసీ వివరాలు తప్పకుండ తెలియజేయాలి లేకుండా రెండు బీమా సంస్థలు కలిపి 50-50 క్లెయిమ్స్ ని ఇస్తాయి
6- పాలసీదారుల అవసరాల మేరకు అవసరమైన రైడర్ లను మాత్రమే ఎంచుకోవాలి
7- పాలసీ ఉందన్న విషయాన్నీ కుటుంభం సబ్యులకు తప్పకుండ తెలియజేసి ఒక ప్రింట్ కాపీని ఇంట్లో పెట్టుకోవాలి
8- చివరగా పాలసీ తీసుకున్న 15 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ లో మన పేరు ,నామిని ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పనిసరి సరిచూసుకోవాలి