ACCIDNTAL INSURANCE – Telugu Policy

ACCIDNTAL INSURANCE – Telugu Policy

జీవన మనుగడ కోసం ప్రతిరోజు ఏదో ఒక ప్రయాణం చేయాల్సి వస్తుంది ఈ క్రమంలో ఆపద ఎప్పుడు,ఎటువైపు నుండి వస్తుందో ఊహించలేం అలాగే వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న పరిస్థితున్నో కూడా అగ్ని ప్రమాదం లాంటి సంఘటనలు చూస్తున్నాం. యిటువంటి పరిస్థితుల నుండి మనకి మన కుటుంబానికి భద్రత కోసం ఈ పాలసీ ఎంతో తోడ్పడుతుంది ఒకవేళ ప్రమాదంలో ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి తీవ్ర గాయాలైన,అంగవైకల్యం పాలైన శరీరంలోని ఏదైనా అవయవం కోల్పోయిన మనకి జరిగిన నష్టాన్ని ఈ పాలసీ ద్వారా ఆర్థిక భరోసాను పొందవచ్చు

ప్రమాద బీమాను రెండు రకాలుగా విభజించవచ్చు..అవి
1)వ్యక్తిగత ప్రమాద బీమా- అనగా ఒకే వ్యక్తి తన కోసం వ్యక్తిగతంగా తీసుకొనే పాలసీనే వ్యక్తిగత ప్రమాద బీమా అంటారు
2) వ్యక్తిగత గ్రూప్ ప్రమాద బీమా- కొందరు వ్యక్తుల సమూహ ప్రయోజనం కోసం తీసుకొనే పాలసీనే “గ్రూప్ పర్సనల్ ఆక్సిడెంట్ పాలసీ” అంటారు. ఇది వివిధ వ్యాపార సంస్థలు లేదా కర్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం పాలసీని తీసుకుంటాయి

వ్యక్తిగత ప్రమాద బీమా 4 రకాల ప్రమాదాలను కవర్ చేస్తుంది

1- మరణ ప్రయోజనం : బీమా చేయబడిన వ్యక్తి ప్రమాద కారణంగా మరణించినట్లయితే వారిపై ఆధారపడిన వారి కుటుంబానికి మరణ ప్రయోజనాలు చెల్లించబడుతాయి.

2 : శాశ్వత అంగవైకల్యం : ఏదేని ప్రమాద కారణంగా పాలసి దారుడు శరీర అవయవాలు పనిచేయకుండా పొయ్యి శాశ్వత అంగ వైకల్యం ఏర్పడితే బీమా మొత్తం అతనికి అందిస్తుంది.ఉదాహరణకి…కంటిచూపు,వినికిడి,మాటలు,శరీర అవయవాలు మొదలైనవి కోల్పోవటం

3) శాశ్వత పాక్షిక వైకల్యం : ఏదేని ప్రమాద కారణంగా పాలసీ దారుడి శరీర అవయవాలు కొంత మేరకు మాత్రమే నష్టపోయిన కూడా బీమా చేయబడిన వ్యక్తికి పూర్తి బీమా చెల్లింప బడుతుంది.

4)తాత్కాలిక మొత్తం వైకల్యం : ఏదేని ప్రమాద కారణంగా పాలసి ధారుడికి తాత్కాలికంగా అనగా ప్రణ నష్టంగాని, శాశ్వత శారీరక అంగ వైకల్యం గాని కలుగక పోయిన కొద్ది రోజులు పూర్తిగా పనిచేయకుండా ఉండే పరిస్థితిని తాత్కాలిక మొత్తం వైకల్యం అంటాం. అది తన రోజువారీ ఆదాయానికి నష్టానికి గురి చేస్తుంది కావున పాలసీ నిబంధనల మేరకు బీమా చెల్లించ బడుతుంది

దీంతో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా యొక్క అదనపు ప్రయోజనాలు :

ఆసుపత్రి రోజువారీ నగదు: ఏదేని ప్రమాద కారణంగా ఆసుపత్రిలో చేరిన సందర్భంలో పాలసీ ధారుడికీ ఆసుపత్రిలో ఉన్నన్నిరోజులు నేరుగా నగదు చెల్లించ బడుతుంది.

అంబులెన్సు ఖర్చులు : ఏదేని ప్రమాదం కారణంగా పాలసీదారుడు ప్రయాణించే అంబులెన్సు చార్జీలను అందిస్తుంది

మృతదేహాలను రవాణా చేయటం లేదా స్వదేశానికి తరలించడం

విరిగిన ఎముకలకు ఆర్థిక పరిహారం: ఏదేని ప్రమాదంలో ఎముకలు విరిగిన లేదా దెబ్బతిన్నట్లయితే పలసి క్రింద స్థిర ప్రయోజనం అందించబడుతుంది

కాలిన గాయాలకు ఆర్థిక పరిహారం : ప్రమాదవశాత్తూ కాలిన గాయాలకు కూడా పాలసీ ద్వారా ప్రయోజనం అందించబడుతుంది.

కుటుంబ రవాణా భత్యం: పాలసీ దారుడు ఆసుపత్రిలో ఉన్నపుడు అతనిnకుటుంభం ఇంటి నుండి ఆసుపత్రికి ఆసుపత్రినుండి ఇంటికి చేసే రవాణా ఖర్చులు కూడా చెల్లింపబడుతాయి

విద్య ప్రయోజనం : పాలసీ దారుడి అకాల మరణంతో అతనిపై ఆధారపడిన పిల్లల చదువులకు ఏటువంటి ఆకంటం రాకుండా పాలసీ కవర్ చెయ్యబడుతుంది

లోన్ ప్రొటెక్టర్ : పాలసీ దారుడు తీసుకున్న లోన్లకు మొత్తం చెల్లింపబడుతుంది

ACCIDNTAL INSURANCE – Telugu Policy

అడాప్టేషన్ అలవెన్స్: అనగా ఇంటి మార్పు లేదా వాహన సవరణకు నిచ్చే ప్రయోజనంగా చెప్పవచ్చు.ప్రమాదం కారణంగా అంగవైకల్యం ఏర్పడితే ఇల్లు లేదా వాహనాన్ని సవరించడానికి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటది అందుకు ఈ పాలసీ ప్రయోజనం అందిస్తుంది

మృతదేహాల రవాణా ఖర్చులను కవర్ చేస్తుంది : పాలసీ దారుడు ప్రమాదవశాత్తూ విదేశాల్లో మరణిస్తే మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావటానికి అయ్యె ఖర్చును భరిస్తుంది.అలాగే స్వదేశలో లేదా ఆసుపత్రిలో మరణించిన స్వశన వాటికకు తరలించే ఖర్చులను కవర్ చేస్తుంది

అంత్యక్రియల ఖర్చులను కవర్ చేస్తుంది : దహన సంస్కారాలకు సంభందించిన ఖర్చులను మతపరంగా నిర్వహించే కార్యక్రమాలకు అయ్యే ఖర్చులను కూడా పాలసీ కవర్ చేస్తుంది

వ్యక్తిగత ప్రమాద బీమా ఫీచర్లు :

విస్తృత కవరేజ్ – తక్కువ ప్రీమియం: ఇతర రకాల పాలసీలతో పోల్చుకుంటే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలో బహుళ ప్రయోజనాలతొ పాటు అతి తక్కువ ప్రీమియం చెల్లించ బడుతుంది

ప్రపంచవ్యాప్త కవరేజ్ : చాలా రకాల బీమా పాలసీలు భౌగోళిక పరిధిని కలిగి ఉంటాయి అంటే అవి భారతదేశం వెలుపల సంభవించే ఏదేని ప్రమాదానికి పరిహారం చెల్లించదు కానీ వ్యక్తిగత ప్రమాద బిమాలో అలాంటి పరిమితి లేదు ప్రమాదం జరిగిన ప్రదేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్త కవరేజ్ అందిస్తుంది.

వైద్య పరీక్షలు అవసరంలేదు : ఆరోగ్య బీమా వలె ఇందులో ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లెవ్వు

జీవితకాలపు పునరుద్ధరణ : ప్రతి సంవత్సరం పాలసీని సకాలంలో పునరుద్ధరించినట్లయితే జీవితాంతం ఈ పాలసీని కొనసాగించవచ్చు.

వెయిటింగ్ పిరియడ్ లేదు : ఈ పాలసీలో ఏటువంటి నిర్ణీత కాల నిబంధనలు లేవ్వు. పాలసీ తీసుకున్న రోజు నుండే పాలసీ ప్రయోజనాలు పొందవచ్చు

ప్రజా రవాణాలో ప్రయాణిస్తే రెట్టింపు ప్రయోజనం : ఈ పోలీసిలో ఉన్న అద్భుత ప్రయోజనం ఇది.ప్రభుత్వ అధీనంలో ఉన్న ఏ ప్రయాణ సాధనంలో నైనా ప్రమాదం సంభవిస్తే రెట్టింపు ప్రయోజనం అందిస్తాయి.

పన్ను ప్రయోజనాలు :
ఆదాయ పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80 D ప్రకారం ఎలాంటి ప్రీమియం చెల్లింపులకు గాని బీమా పరిహారానికి గాని యిటువంటి పన్నులు విధించరు

వ్యక్తిగత ప్రమాద బీమా ఎలా పనిచేస్తుంది…?

వ్యక్తిగత ప్రమాద బీమాలో ఏమి కవర్ చేయబడుతాయి

వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ క్రింద కవర్ చేయని విధానాలు :
1 ఆత్మహత్య కారణంగా పాలసీ పొందిన వ్యక్తి ఏటువంటి బీమా ప్రయోజనాన్ని పొందలేడు
2 పాలసీ దారుడు ఉద్దేశ పూర్వకంగా స్వయంగా గాయాలు చేసుకున్నట్లయితే లేదా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో ప్రమాదం సంభవించినట్లయితే పాలసీ కవర్ చెయ్యదు
3 సాహస క్రీడల వల్ల తలెత్తే గాయాలు కూడా పాలసీ కవర్ చెయ్యబడదు
4 పౌర యుద్ధం లేదా విదేశీ యుద్ధంలో పాల్గొనటం వల్ల అయిన నష్టాలను పాలసీ కవర్ చెయ్యదు
5 మద్యం మత్తులో అనగా మత్తు పదార్థాలు, ఆల్కహాల్ ,డ్రగ్స్ వంటి వాటినీ తీసుకొని ప్రమాదానికి గురైతే పాలసీ వర్తించదు
6 చట్ట వ్యతిరేక దేశ ద్రోహ కార్యక్రమాలు సమ్మెలు,నిరసనలు,అల్లర్లలో పాల్గొని ఏదేని ప్రమాదం సంభవించినట్లయితే
7 సాయుధ దళాల్లో పనిచేస్తున్న వ్యక్తి విధి నిర్వహణలో భాగంగా ఏదేని ప్రమాదం సంభవించిన యెడల యిటువంటి కవర్ చేయబడదు.
8 HIV, ఏయిడ్స్,STD వంటి వ్యాధుల కారణంగా ఏదేని ప్రమాదం సంభవిస్తే బీమా చెల్లింపబడవు
9 గత అనారోగ్యాల కారణంగా ఏదేని తీవ్రమైన అనారోగ్యం ఏర్పడితే ఈ పాలసీ క్రింద కవర్ చెయ్యబడదు.
10 గర్భం లేదా ప్రసవ సంభందిత సమస్యల వల్ల ఉత్పన్నం అయ్యె ఏటువంటి దావాలకు బీమా చెల్లిపబడదు

పాలసీ చేయడానికి ఎవరు అర్హులు…?

వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ కోసం ఎవరైనా దరఖాస్తు చెయ్యవచ్చు
వీరు తప్ప
1)వైమానిక దళ సభ్యులు
2)సాయుధ దళాల సభ్యులు
3)నిర్ధేశిత వయస్సు లేనివారు అనగా 5సంవత్సరాల నిందనివారు మరియు 70 సంవత్సరాలు నిండివారు

వ్యక్తిగత ప్రమాద బీమా ఎంతంతీసుకోవాలి..?
ఇది పాలసీదారుడీ సంపాదన మీద ఆధారపడి ఉంటుంది పాలసీ డారుడి నెల సంపాదనకి 100 రెట్లు పాలసీ తీసుకోవచ్చు ఉదా…
మీ ప్రస్తుత సంపాదన నెలకు 10000 (పది వేలు) అయితే మీరు1000000(పది లక్షలు) వరకు బీమా చెయ్యవచ్చు.

పాలసీ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు
సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీలు వయస్సును బట్టి ప్రీమియం నిర్ణయించబడతాయి వ్యక్తిగత ప్రమాద బీమా వయసుతో పాటు వృత్తులను బట్టి 3 వర్గాలుగా విభజించడం జరిగింది
CLASS- 1 ఇందులో ప్రమాద రిస్క్ తక్కువగా ఉంటుంది కావున ఈ కేటగిరి వాళ్లకు తక్కువ ప్రీమియం ఉంటుంది
ఉదా…అకౌంటెంట్స్,బాంకు ఉద్యోగులు లాయర్స్ మొదలగువారు
CLASS-2 ఇందులో ప్రమాద రిస్క్
క్లాస్ 1 కేటగిరితో పోల్చితే ఎక్కువగా ఉంటుంది కావున ప్రీమియం కూడా పెరుగుతుంది
ఉదా… బిల్డర్స్, కాంట్రాక్టర్స్ మెదలైన వారు
Calss-3 ఇందులో ప్రమాద రిస్క్ అతి ఎక్కువగా ఉంటుంది కావున ప్రీమియం కూడా ఎక్కువగనుంటుంది
ఉదా.. జర్నలిస్టులు,కొండలపై నివసించే వారు,గనులు,మైన్స్ వాటిలో పని చేసేవారు

వ్యక్తిగత ప్రమాద బీమా క్లెయిమ్ చేసే విధానం
1 మొట్ట మొదటి సారిగా పాలసీ దారునికి అనుకొని ప్రమాదం ఏర్పడితే వెంటనే ఆయా బీమా సంస్థకు సమాచారం అందించాలి.
2) క్లెయిమ్ పారంలో మీ పాలసీ నెంబర్ ,ప్రమాదం జరిగిన ప్రదేశం, తేది,సమయం పేర్కొనాలి
3) ప్రమాద నష్టం ఎలా జరిగిందో వివరించాలి.
4) వైద్య ధృవీకరణ పత్రం
5) మెడిసిన్స్ బిల్లులు
6) FIR నివేదిక
7) మరణం సంభవించినట్లయితే మరణ ధృవీకరణ పత్రం(DEATH CERTIFICATE)
8) పోస్ట్ మార్టం నివేదిక

ACCIDNTAL INSURANCE – Telugu Policy