పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI ) 1884 వ సంవత్సరం ప్రారంభించబడింది ప్రారంభంలో కేవలం పోస్టల్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రారంభించబడి 1888 లో టెలిగ్రాఫ్ ఉద్యోగులకు విస్తరించబడింది. మహిళలకు ఈ ఇతర బీమా కంపనీ ఇవ్వని రోజుల్లోనే 1894 లో మొట్ట మొదటిగా మహిళా ఉద్యోగుల బీమా పరిధిలోకి తీసుకవచ్చి వారి రక్షణ కోసం పాలసీలను విస్తరించింది .ఈ భారత దేశంలోనే అత్యంత పురాతన బీమా సంస్థ పోస్టల్ పాలసీలను రెండు వర్గాలుగా విప్=భజించవచ్చు అవి.
(1) PLI -పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్
(2) RPLI -రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కు ఎవరు అర్హులు : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ,రక్షణ మరియు పారా మిలటరీ ఉద్యోగులు , ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు బ్యాంకులు,విద్య సంస్థలు ,స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మరియి వృత్తి నిపుణులైన డాక్టర్లు ,ఇంజనీర్లు ,చార్టర్ అకౌంట్లు ,లాయర్లు ,MBA లు ,నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (NSE ) మరియు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE ) కంపనీల ఉద్యోగులను కవర్ చేస్తుంది .
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ : పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లోని వివిధ పాలసీలను గురించి క్రింద పేర్కొనబడింది
(1) సురక్ష హోల్ లైఫ్ ఇన్సూరెన్స్
(2) సువిధ కాన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్
(3) సంతోష్ ఎండోమెంట్ అస్సురెన్సు
(4) యుగల్ సురక్ష జాయింట్ లైఫ్ ఇన్స్యూరెన్సు
(5) సుమంగల్ యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్సురెన్సు
(6) బాల్ జీవన్ బీమా చిల్డ్రన్ పాలసీ
రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ( RPLI) : భారత దేశం లోని గ్రామీణ ప్రజలకోసం గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ 1995 లో ప్రారంభించబడింది రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను క్రింద వివరించడం జరిగింది గ్రామీణ ప్రాంతాలకు బీమా ప్రయోజనాలను అందించడం ముఖ్యంగా బలహీన వర్గాలు ,మహిళలు,కార్మికులకు బీమా అందించడం ఈ పధకం ప్రధాన లక్ష్యం
(1) గ్రామ సురక్ష హోల్ లైఫ్ ఇన్సూరెన్స్
(2) గ్రామ్ సువిధ కన్వెర్టబుల్ హోల్ లైఫ్ అస్యూరెన్సు
(3) గ్రామ్ సంతోష్ ఎండోమెంట్ అస్సురెన్సు,
(4) గ్రామ్ ప్రియ
(5) గ్రామ్ సుమంగల్ యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్సురెన్సు
(6) బాల్ జీవన్ చిల్డ్రన్ బీమా
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కు ఎవరు అర్హులు : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు కేంద్ర ప్రభుత్వం చేత ఎంపిక చెయ్యబడ్డ కాంట్రాక్ మరియు ఇతర ఉద్యోగులు ,రక్షణ మరియు పారా మిలటరీ ఉద్యోగులు. ఆటోనమస్ బాడీలో పని చేస్తున్న వారు,రిజర్వ్ బ్యాంకు ,ఇతర జాతీయ బ్యాంకులు షెడ్యూల్డ్ కమ్మర్షియల్ బ్యాంకులు ,ప్రభుత్వ ఆర్థిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ,పోస్టల్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రభుత్వ -ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచే విద్య సంస్థలు ,డీమ్డ్ యూనివర్సిటీ , ప్రభుత్వం గుర్తింపు పొందిన కో – ఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులు మరియు వృత్తి నిపుణులు డాక్టర్,ఇంజనీర్ ,లాయర్ లు స్టాక్ ఎక్స్చేంజి (NSE ) మరియు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE ) కంపనీల ఉద్యోగులు మరియు కేంద్ర రాష్ట్ర గుర్తింపు పొందిన యూనివర్సిటీలు ,విద్యా సంస్థల్లో పట్టా పొందిన గ్రాడ్యుయేట్ లు,డిప్లమా హోల్డర్లు అర్హులు