MOTOR INSURANCE – Telugu Policy
MOTOR INSURANCE – Telugu Policy మోటార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి
బైకు ,కారు ,లారీ వంటి వాహనాలకు దాని యజమాని తీసుకొనే పాలసీని మోటార్ ఇన్సూరెన్స్ లేదా వాహన బీమా అంటారు ఈ ఇన్సూ రెన్స్ వాహనాన్నే కాకుండా వాహన యజమాన్నీ కాపాడుతుంది రోడ్డు ప్రమాదాలు ,దొంగతనాలు ,అగ్ని ప్రమాదాలు పకృతి విపత్తులు వంటి ప్రమాదాల నష్టాల నుండి లక్షల్లో విలువ చేసే మీ వాహనాన్ని మిమ్మల్ని కాపాడుతుంది . మోటార్ వెహికల్ చట్టం 1988 ప్రకారం మన దేశంలో ఏదేని వాహనం రోడ్డు మీద తిరగాలంటే కనీసం థర్డ్ పార్టీ ఇన్సురెన్సు తప్పనిసరి
IRDAI ప్రకారం మోటార్ ఇన్సురెన్సు పాలసీలకు సంబంధించి రెండు రకాల పాలసీలున్నాయి అవి ..
థర్డ్ పార్టీ ఇన్సురెన్సు పాలసీ
సమగ్ర బీమా ( కాంప్రహెన్సివ్ పాలసీ
థర్డ్ పార్టీ ఇన్సురెన్సు : అనగా మీ వాహనం వల్ల వేరే వాహనానికి లేదా వ్యక్తికి ప్రమాదంలో ఆస్తినష్టం ప్రాణ నష్టం వాహనం డ్యామేజీ అయితే ఈ పాలసీ ద్వారా ఆ నష్టాన్ని బీమా సంస్థ భరిస్తుంది .ఈ పాలసీ కలిగి ఉన్నవాహన యజమాని వాహనం డ్యామేజికి గాని ప్రాణ నష్టానికి గాని ఎటువంటి బీమా కవర్ చేయబడదు కేవలం మీ వాహనం వాళ్ళ ఇతరులకు అనగా థర్డ్ పార్టీకి కలిగిన నష్టాన్నే భరిస్తుంది( మొదటిపార్టీ అనగా వాహన యజమాని ,రెండవ పార్టీ అనగా బీమా కంపెనీ ,థర్డ్ పార్టీ అనగా మొదటి పార్టీ వాహన యజమాని. మోటార్ వెహికల్ చట్టం 1988 ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి.
కాంప్రహెన్సివ్ లేదా సమగ్ర బీమా : అనగా ఏదేని ప్రమాదంలో మీ వాహనం వళ్ళ ఆస్థి నష్టం, ప్రాణ నష్టం, వాహన డ్యామేజికి మీకు మీ వళ్ళ జరిగిన ఇతర వాహన నష్టాలకు ఈ సమగ్ర బీమా పాలసీ కవర్ చేస్తుంది .ఈ పాలసీలో వాహన ప్రమాదాలే కాకుండా వాహన దొంగ తనాలు ,అగ్ని ప్రమాదాలు ,పకృతి విపత్తులు వంటి అనేక నష్టాలనుండి పాలసీ కవర్ చేస్తుంది
IRDAI భరత్ దేశంలోని వివిధ వాహనాలను 3 భాగాలుగా విభజించడం జరిగింది. మన రోడ్లపై తిరుగుతున్న ప్రతి వాహనం ఈ మూడు భాగాలలో ఏదో ఒక విభాగం పరిధిలోకి వస్తుంది అవి…
MOTOR INSURANCE – Telugu Policy
కార్ ఇన్సూరెన్స్
బైక్ ఇన్సూరెన్స్
కమర్షియల్ ఇన్సూరెన్స్
1 కార్ ఇన్సూరెన్స్ : ఇది వ్యక్తిగత లేదా ప్రైవేట్ అవసరాల కోసం ఉపయోగించే వాహనానికి సంబంధించిన పాలసీ రోడ్డు మీద తీరిగె ప్రతి ప్రైవేట్ కార్ లకు ఈ పాలసీ పరిధిలోకి వస్తుంది.ప్రమాదాలు అగ్నిపర్వతాలు పకృతి విపత్తులు దొంగతనాలు వంటి నష్టాలనుండి కవర్ చేస్తుంది కాంప్రహెన్సివ్ సమగ్ర బీమా ఉన్నట్లయితే మీ వాహనానికి ఇతర వాహనాలకు జరిగిన నష్టాలను ఈ పాలసీలో కవర్ చెయ్యబడతాయి.అందుకే సమగ్ర బీమాను ఎంచుకోవాలని చెపుతుంటాం
2 బైక్ ఇన్సూరెన్స్ : ఈ పాలసీ ద్వారా మీ స్కూటర్,బైక్ లేదా మీ టూ వీలర్ వాహనాలను కవర్ చేస్తుంది.కంప్రహెన్సివ్ పాలసీ ఉన్నట్లయితే ప్రమాదాలు విపత్తులు అగ్ని ప్రమాదాలు దొంగ తనాల నుండి మీ వాహన నష్టాన్ని కవర్ చేస్తుంది
3 కమర్షియల్ వెహికల్ ఇన్సురెన్సు : వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా వ్యాపార వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే వాహనాల కోసం తీసుకొనే పాలసీని కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ అంటారు. ప్రయాణికుల కోసం ,సరుకుల రవాణా కోసం ఉపయోగించే ఈ వాహనాలకు బీమా తప్పని సరిగా తీసుకోవాలి ఎందుకంటే కమర్షియల్ వాహనాలు తరచు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది
మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయు ప్రమాదాలు :
1 ప్రమాదవశాత్తు జరిగే రోడ్డు ప్రమాదాలు
2 వరదలు,భూకంపాలు,తుపానులు,కొండ చర్యలు విరిగి పడ్డ ప్రమాదాలను వాహన బీమా కవర్ చేస్తుంది
3 అగ్ని ప్రమాదాల కారణంగా వాహనానికి జరిగిన నష్టాలను
4 ఉగ్రవాద చర్యల కారణంగా వాహనానికి జరిగిన నష్టం
5 అల్లర్లు ,సమ్మెలు కారణంగా వాహనానికి జరిగిన నష్టాలను
6 వాహన దొంగ తనాలు వాహన బీమాలో కవర్ చెయ్యబడతాయి
మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చెయ్యని ప్రమాదాలు :
1 ఆల్కహాల్ ,మత్తు పదార్ధాలు ,డ్రగ్స్ కారణంగా ఏదేని వాహన ప్రమాదం జరిగితే మోటార్ బీమా కవర్ చెయ్యదు
2 సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహన నడిపి ప్రమాదానికి గురైతే
3 చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొని వాహనానికి ఏదేని ప్రమాదం జరిగితే
4 పాలసీలో పేర్కొన్న బౌగోలీక ప్రాంతంలో కాకుండా వేరే చోట్ల ప్రమాదం సంభవిస్తే
వాహన బీమా ప్రీమియంపై ప్రభావం చూపే అంశాలు :
వాహన మోడల్ ; మోటార్ ప్రీమియం మీ వాహన తయారీపై ఆధారపడి ఉంటుంది అలాగే వాహన మోడల్, క్యూబిక్ సామర్ధ్యం వేరియంట్ ఫై ఆధారపడి ఉంటుంది
వాహన వయస్సు : కొత్త వాహనానికి ఎక్కువ ప్రీమియం పాత వాహనానికి తక్కువ ప్రీమియం చెల్లించ బడుతుంది
వాహన ఇంజన్ : వాహన ఇంజన్ పెట్రోల్ లేదా డిసీల్ తోపాటు వాహనం IDV( IDV అనగా మీ వాహన మార్కెట్ విలువ) ప్రీమియంను ప్రభావితం చేస్తుంది
యాడ్ -ఆన్ లు : వాహన బీమా ప్రయోజనాలతో పాటు అదనపు ప్రయోజనాల కోసం రైడర్ లను ఎంచుకుంటే ప్రీమియం పెరుగుతుంది
నో క్లెయిమ్ బోనస్ లు : పాలసీ సంవత్సరంలో వాహనానికి ఎటువంటి క్లెయిమ్స్ చేయని యెడల నో క్లెయిమ్ అంటామ్.ఈ నో క్లెయిమ్ బోనస్ అనే ప్రయోజనం వల్ల మరుసటి సంవత్సరం రెనివల్ సమయంలో ప్రీమియం తగ్గించవచ్చు .
వాహనం స్థానం : కారు ఉన్న ప్రదేశంపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది గ్రామీణ పట్టన ప్రాంతాల్లో ప్రీమియం తక్కువగాను మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీ దృష్ఠ ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువ కావున ప్రీమియం ఎక్కువ గాను ఉంటుంది
సరైన మోటార్ పాలసీని ఎంచుకొనే విధానం – మోటార్ ఇన్సూరెన్స్ చెక్ లిస్ట్ : మీకు ,మీ వాహనానికి రక్షణ కల్పించే సరైన మోటార్ బీమాను ఎంచుకోవటం చాలా ముఖ్యం
కవరేజ్ : వాహన బీమాలో మొదటిది, ముక్యమైనది . మన వాహన IDV విలువకు మన పాలసీ కవరేజీ సరిపోతుందో లేదో పరిశీలించాలి
వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ : మనం ఎంచుకొనే వాహన బీమాలో వ్యక్తిగత ప్రమాద బీమా ఉందొ లేదో నిర్ధారించుకోవాలి
ఆడ్ – ఆన్ లు : వాహన బీమా ఎంపికలో మన అవసరాలకు తగ్గ అన్ని ప్రయోజనాలు ఉన్నాయో లేవో పరిశీలించి మన అవసరాల కోసం మన పాలసీలో ఆడ్ ఆన్ చేసుకోవటం ద్వారా ఏదేని ప్రమాద నష్టాలను తక్కువ ప్రీమియంతో కవర్ చేయవచ్చు
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో : మనం ఎంచుకోబోయే బీమా సంస్థ క్లెయిమ్స్ ని ఎంత త్వరగా పరిష్కరించ బడుతుందో తెలియజేసే నివేదిక ఇది పాలసీ తీసుకొనే ముందు మంచి సెటిల్మెంట్ రేషియో ఉన్న బీమా సంస్థను ఎన్నుకోవటం ముఖ్యం
నో క్లెయిమ్ బోనస్ : మీరు ఎంచుకొనే వాహన బీమాలో నో క్లెయిమ్ బోనస్ ఫీచర్ ఉందొ లేదో తెల్సుకోవటమే కాకుండా ఒకవేళ మన పాలసీని వేరే బీమా సంస్థకు మారితే నో క్లెయిమ్ బోనస్ బదిలీ అవుతుందా లేదా పరిశీలించాలి
MOTOR INSURANCE – Telugu Policy
కస్టమర్ సర్వీసులు : ప్రమాదం జరిగిన వెంటనే పాలసీదారుడి అవసరాల కోసం 24=7 కష్టమర్ సర్వీసులు ,వాహనం రోడ్డుపై ఆగినపుడు పాలసీదారుల పికప్ అండ్ డ్రాప్,రోడ్ సైడ్ అసిస్టెంట్ సేవలు క్యాష్ లెస్ గ్యారేజీలు వంటి సర్వీసులు ఉన్నాయో లేదో పరిశీలించాలి
జీరో డిప్రిసియేషన్ ; వాహన విలువ ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉంటుంది కావున వాహనానికి ఏదేని ప్రమాదం సంభవించినచొ ఈ మార్కెట్ విలువ ప్రకారం మాత్రమే బీమా కవర్ చెయ్యబడుతుంది అందుచేత ఈ జీరో డిప్రెసియేషన్ గల పాలసీ తీసుకున్నట్లయితే వాహన విలువ ఏ మాత్రం తగ్గకుండా బీమా కవర్ చెయ్యబడుతుంది
పాలసీ నిభంధనలను పరిశీలించడం : చివరగా పాలసీ కొని సంతకం పెట్టె ముందు మన పాలసీకి సంబంధించిన షరతులను ,నియమ నిబంధనలు పరిశీలించాలి
మోటార్ బీమా ఎలా క్లెయిమ్ చెయ్యాలి : మోటార్ బీమా క్లెయిమ్ సెట అనేది వాహనాన్ని బట్టి,వాహన ప్రమాదాన్నిబట్టి ఉంటుంది.ముందుగా పాలసీదారుడు వాహన నష్టానికి సంబంధించిన ఒక ఎస్టిమేషన్ని బీమా కంపానికి అందించాలి ఆ తర్వాత బీమా కంపనీ ఇంజనీరింగ్ అర్హతగల ఇండిపెండెంట్ ఆటో మొబైల్ సెర్వెయర్ తో ప్రమాద ప్రమాద కారణాన్ని ప్రమాద తీవ్రతను అంచనా వేసు బీమా సంస్థకు నివేదిక అందిస్తాడు . ఆ నివేదిక ననుసరించి బీమా కంపెనీ పాలసీ దారునికి నష్ట నివారణ చర్యలు తీసుకుంటుంది.
మోటార్ ఇన్సూరెన్స్ బీమా కోసం ఈ డాకుమెంట్స్ తప్పనిసరి :
1- పూర్తిగా నింపిన క్లెయిమ్ ఫారం
2-డ్రైవింగ్ లైసెన్స్
3-R.C book వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
4- వాహన రీపెర్ కోసం అయినా బిల్లులు
5- FIR కాఫీ
ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం అయితే బీమా దారుడు బీమా కంపెనీకి నోటీసు ఇచ్చిన అనంతరం క్లెయిమ్ పరిష్కారం కోసం ”మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ట్రిబ్యునల్” కి పంపబడుతుంది .అప్పుడు బీమా దారుడు ఈ క్రింది డాక్యూమెంట్స్ సమర్పించవల్సి ఉంటుంది
1 పోలీస్ రిపోర్ట్
2 డ్రైవింగ్ లైసెన్స్
3 మెడికల్ సర్టిఫికెట్
4 మరణం సంభవించినచో డెత్ సర్టిఫికెట్ సమర్పించాలి
MOTOR INSURANCE – Telugu Policy