HEALTH INSURANCE – Telugu Policy

HEALTH INSURANCE – Telugu Policy

HEALTH INSURANCE – ఆరోగ్య బీమా అనేది ఉహించని వైద్య అత్యవసర పరిస్థితిలో వైద్యానికి అయ్యే అన్ని ఖర్చులను భరిస్తానని పాలసీదారునికి- బీమా సంస్థ ఇచ్చే చట్టపరమైన హామీ లేదా ఒప్పందం. ఇందుకోసం పాలసీదారుడు బీమా సంస్థకు క్రమం తప్పకుండ ప్రీమియం చెల్లిస్తాడు అందుకు ప్రతిఫలంగా బీమా సంస్థ ఆసుపత్రి బిల్లులు చెల్లిస్తుంది. మారుతున్న జీవనశైలి కొత్త కొత్తగా పుట్టుకస్థున్న రోగాలు కారణంగా ఆరోగ్య బీమా ప్రాధాన్యత పెరిగింది. ఒక కుటుంభ సంపూర్ణ ఆర్ధిక ప్రణాళికలో ఆరోగ్య బీమా తప్పనిసరి.ఆరోగ్య బీమా లేనట్లయితే ఊహించని అనారోగ్యం ఎదురైతే వైద్యానికి అప్పుతేవటమో ,ఆస్తులు అమ్మటమో లేదా సంపాదించిందంతా ఆసుపత్రులకు పెట్టడమో జరుగుతుంది కావున ఈ విధమైన ఆర్ధిక నష్టాల నుండి ఆరోగ్య బీమా కాపాడుతుంది.

ఆరోగ్య బీమా ఎన్ని రకాలు

1) వ్యక్తిగత ఆరోగ్య బీమా: ఒక పాలసీ దారుడికి బీమా కంపెనీ హామీ ఇచ్చిన మొత్తం ఆ వ్యక్తికే కవర్ చేయబడుతుంది. కావున దీన్ని వ్యక్తిగత ఆరోగ్య బీమా అంటారు.


2) ఫ్యామిలీ ఫ్లోటర్
: అనగా కుటుంబంలోని వ్యక్తులందరికి కలిపి ఒకే పాలసీ ద్వారా బీమా సౌకర్యం కల్పించడం అన్నమాట.ఈ పాలసీలో కుటుంభాన్నంతా ఒకే గొడుగు క్రింద చేర్చి ఒకే ప్రీమియం చెల్లించవచ్చు.


3) సీనియర్ సిటిజన్ హెల్త్ ప్లాన్స్ : అనగా ఈ పాలసీలో 60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారికి ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందించే పాలసీ.


4) క్రిటికల్ ఇల్నేస్ ఇన్సూరెన్స్ ప్లాన్స్: తీవ్రమైన వ్యాధులకు ఈ పాలసీ చక్కటి వరం.ఇందులో క్యాన్సర్, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, పక్షవాతం, కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ, ఫస్ట్ హార్ట్ అటాక్, పల్మోనరి ఆర్టిరియల్ హైపర్ టెన్షన్, మల్టిపుల్ సిర్రోసిస్, ఓర్టా గ్రాఫ్ట్ సర్జరీ లాంటి వ్యాధులు ఈ పాలసీలో కవర్ చేయబడుతాయి.


5) మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్: కొత్తగ పెళ్ళయిన జంటలు లేదా పిల్లల్ని కనాలనుకొనే దంపతులు ఈపాలసీని తీసుకున్నట్లయితే సాధారణ మరియు సీజేరియన్ రెండిటికీ ప్రసూతి ఖర్చులకు కవరెజీని అందిస్తాయి.అప్పుడే పుట్టిన నవజాత శిశువుకు Day-1 నుండి 90 రోజుల వరకు వచ్చే ఏటువంటి అనారోగ్య సమస్య అయిన మెటర్నిటీ పాలసీ కవర్ చేస్తుంది.


6) వ్యక్తిగత ప్రమాద బీమా: ఇది కూడా ఆరోగ్య బీమా పాలసీలో భాగం ఏదేని అనుకొని ప్రమాదం కారణంగా మరణం లేదా అంగ వైకల్యం సంభవించినప్పుడు వైద్య ఖర్చులతో పాటు ఎంత మొత్తానికి పాలసీ చేయబడింది అంత అంత మొత్తాన్ని వారికి డబ్బు రూపంలో చెల్లిస్తుంది.


7) గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ :ఈ పాలసీని సాధారణంగా కంపెనీలు తమ ఉద్యోగులకు,వారి కుటుంబ సభ్యులకు కూడా అందిస్తాయి.పాలసీ కొనుగోలు పక్రియా అంత ఆ సంస్థ యజమాని భరిస్తాడు


8) యూనిట్ లింక్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్: ఈ రకమైన పాలసీ ఈ మధ్య కాలంలో ప్రవేశ పెట్టబడింది.ఇది ఆరోగ్య బీమా తో పాటు పెట్టుబడిని కూడా కలగలిపిన మిశ్రమ పాలసీ ఇందులో ఆరోగ్య రక్షణతో పాటు ఆరోగ్య బీమా పరిధిలోకి రానీ ఖర్చులను కూడా కవర్ చేసే ప్రత్యేకత ఈ పాలసీలో కలదు

ఆరోగ్య బీమా యెక్క ప్రయోజనాలు:

1- నగదు రహిత చికిత్స ; ప్రతి ఆరోగ్య బీమ సంస్థ అన్నీనాగరాలు, పట్టణాలలో ఉన్న ఆసుపత్రులతో అనుసంధానం చేసుకుంటాయి. వీటినే ‘నెట్వర్కింగ్ హాస్పటల్ లిస్ట్’ అంటారు. పాలసీ దారుడు తన చికిత్స నిమిత్తం తన పాలసీ నెంబర్ చెపితే చాలు ఉచితంగా చికిత్స అందిస్తారు. రూమ్ రెంట్ ,icu చార్జీలు , డాక్టర్ ఫీజులు, మెడిసిన్ ఖర్చుతో పాటు ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన అన్ని ఖర్చులను ఆరోగ్య బీమ సంస్థ చెల్లిస్తుంది.

2- ప్రీ మరియు పోస్ట్ హాస్పిటల్ ఖర్చులు ; ఆరోగ్య బీమ ముఖ్య లక్షణం ఆసుపత్రిలో చేసే ముందు ఖర్చులు మరియు చేరిన తర్వాత అయ్యే ఖర్చులను కూడా కవర్ చేస్తుంది

3- అంబులెన్స్ సౌకర్యం ; ఇంటి నుండి ఆసుపత్రికి ఆసుపత్రి నుండి ఇంటికి అయ్యే దారి ఖర్చులను కూడా బీమా సంస్థే భరిస్తుంది.

4- డే కేర్ చికిస్థలు ; ఇప్పుడు అన్ని ఆరోగ్య బీమా సంస్థలు డేకేర్ చికిత్సలను బీమా పాలసీ పరిధిలోకి తీసుకరావటం జరిగింది.

5- ఇంటివద్ద తీసుకొనే చికిత్సలు ; దీన్నే డొమిసిలరి ట్రీట్ మెంట్ అని కూడా అంటారు . కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఇంటి వద్దే చికిత్స తీసుకున్న దానికి అయ్యే ఖర్చులన్నింటిని ఆరోగ్య బీమా సంస్థ చెల్లిస్తుంది.

6- ఆయుష్ కవర్ ; గతంలో అల్లోపతి చికిత్స విధానాలకు మాత్రమే బీమా చెల్లించేది, కాని ఇప్పుడు అన్ని ఆరోగ్య బీమ సంస్థలు ఆయుర్వేద ,యోగ,యునాని సిద్ధ, హోమియోపతి లాంటి చికిస్థలను కూడా బీమా సంస్థ కవర్ చేస్తుంది .

7- మెడికల్ చెక్ అప్ ; బీమా సంస్థ పాలసీ ధారుణి ఆరోగ్య సంరక్షణ పట్ల శ్రద్ద వహిస్తుంది అందుకు ప్రతి సంవత్సరం బీమా ధారుణి ఆరోగ్య స్థితిని తెలుసుకోవటం కోసం ప్రతి సంవత్సరం ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తుంది.

8- రోబోటిక్ సర్జరీ: హెల్త్ పాలసీలో అత్యాధునిక పరికరాలతో చేసే రోబోటిక్ సర్జరీలు కూడా ఆరోగ్య పాలసీలో కూడా కవర్ చేయబడుతాయి

9- ఆర్గాన్ డోనర్: మీకు అవయవం అవసరం వచ్చినా మీరు వేరే ఎవరికైనా అవయవ దానం చేయాలకున్న అందుకు అయ్యే వైద్య ఖర్చులకు ఆరోగ్య బీమానే కవర్ చేస్తుంది

ఆరోగ్య బీమా ఏ విధంగా పనిచేస్తుంది ?

ఆరోగ్య బీమా తీసుకున్న వెంటనే అన్ని రకాల వ్యాధులు ఒకేసారి కవర్ చెయ్యబడుతాయి అనే అపోహ చాలా మందిలో ఉంది అయితే ఆరోగ్య బీమాను వైద్య ఖర్చుల నుండి తప్పించుకోవటం కోసం తీసుకున్నప్పటికీ  అన్ని వ్యాధులను ఆరోగ్య బీమా సంస్థలు ఏక కాలంలో కవర్ చెయ్యవు. ప్రతి ఆరోగ్య బీమా సంస్థ ఈ క్రింది పరిమితులకు అనుగుణంగా పనిచేస్తుంది. గమనిక : వీటిని కేవలం సులభంగా అర్ధం చేసుకోవటం కోసం మాత్రమే A,B,C,D లుగా విభజించడం జరిగింది అవి…

A –ప్రమాదవశాత్తు జరిగితే :రోడ్డు,రైలు,పడవ,విమాన ,ప్రమాదాలు కరెంట్ షాక్… అగ్ని ప్రమాదాలు అనుకోకుండా  కాలు జారి పడిపోవటం లాంటి ప్రమాదాలు DAY -1 నుండే కవర్ చేయబడతాయి

B –ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ : డెంగ్యూ,మలేరియా,చికెన్ గున్యా ,టైఫాయిడ్,వైరల్ ఫీవర్ ,లాంటి వ్యాధులు 30 రోజుల తర్వాత కవర్ చెయ్యబడతాయి

C –కొన్ని ప్రత్యేక వ్యాధులకు బీమా కవర్ ; కంటి శుక్లాలు,కిడ్నీ స్టోన్స్ ఫైల్స్,గాలి బ్లాడర్, నీ రీప్లేస్మెంట్,మరియు చెవి ముక్కు గొంతు లాంటి సర్జరీలు, 2-సంవత్సరాల తర్వాత కవర్ చెయ్యబడతాయి

D –ప్రీ – ఎక్సిస్టింగ్ డీసీసెస్ : బి.ప్ ,షుగర్ ఆస్తమా,కొలెస్ట్రాల్ వంటి వ్యాధులకు 2-నుండి 4 సంవత్సరాల తర్వాత కవర్ చెయ్యబడతాయి .

గమనిక : కొన్ని రైడర్స్ ని ఆప్ట్ చేసుకుంటే కాల పరిమితి తగ్గుతుంది

ఆరోగ్య బీమా చెక్ లిస్ట్ …..?

1)   కో-పేమెంట్ :  పాలసీ ప్రీమియం తగ్గుదల కోసం ఈ ఆప్షన్ ని కొంతమంది ఎంచుకుంటారు .అంటే హాస్పిటల్ బిల్లులో కొంత శతం పాలసీదారుడు కూడా  కడుతానని హామీ ఇచ్చే పాలసీ రకం. ఇది 5% నుండి 20% వరకు పాలసీదారుడు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు పాలసీదారుడు 10% కో -పేమెంట్ పాలసీని ఎంచుకున్నాడు అనుకుంటే హాస్పిటల్ బిల్లు లక్ష రూపాయలు అయినచో అందులో 10% అంటే పది వేల రూపాయలు పాలసీదారుడు స్వయంగా తన జేబులోంచి తిసికట్టాల్సి వస్తుంది. ఈ కో-పేమెంట్ ఆప్షన్ కాకుండా 100% క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ ఎంచుకోవటం ఉత్తమం

2) రూమ్ రెంట్ లిమిట్ ; కొన్ని తక్కువ ప్రీమియంతో ఆరోగ్య బీమా అందించే బీమా సంస్థలు రూమ్ రెంట్ ఫై పరిమితి విధిస్తాయి ఇవీ 3వేలు లేదా 5 వేలుగా పరిమితి విధించవచ్చు లేదా మీ పాలసీ మొత్తం కవరేజీలో 1% నుండి 5% వరకు పరిమితి విధించవచ్చు ఉదా…5 లక్షల బీమా కవరేజిలో 1% అంటే 5వేలు అన్నమాట.మీరు కనుక 5వేలకు మించిన గదిలో ఉండాల్సి వస్తే ఆ అదనపు చార్జీలను పాలసీదారుడే స్వంతంగా కట్టాల్సివస్తుంది.అంతే కాకుండా ఈ రూంరెంట్ కోసం అయినా చార్జీలు హాస్పిటల్ మొత్తం బిల్లులపై ప్రభావంపడి అంత మేరకు కూడా కట్టాల్సి వస్తుంది కావున రూమ్ రెంట్ ఫై పరిమితి లేని పాలసీని ఎంచుకోవటం ఉత్తమం

3) డిసీజ్ వైస్ సబ్ లిమిట్స్ ; కొన్ని పాలసీలు ఒక్కో వ్యాధిపై కొంత మేరకు మాత్రమే బీమా కవర్ ని పరిమితం చేస్తాయి .ఆ పరిమితి దాటితే ఆ తర్వాత వాటిని పాలసీ కవర్ చెయ్యదు కావున సబ్ లిమిట్స్ లేని పాలసీని ఎంచుకోవటం ఉత్తమం

4) వెయిటింగ్ పీరియడ్ ; ప్రతి బీమా సంస్థ నిర్దిష్ట వ్యాధులకు కొంత కాల పరిమితి విదిస్తుంది ఈ వెయిటింగ్ పీరియడ్ లోపు ఏదేని క్లెయిమ్ చేస్తే బీమా సంస్థ దాన్ని తిరస్కరించవచ్చు.కావున ఈ వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉండే పాలసీలను తీసుకోవటం మంచిది

5) క్యాష్ లెస్ హాస్పిటల్ నెట్వర్క్ ; ప్రస్తుతం IRDAI అన్ని అభిమా సంస్థలకు ఉచిత ఆరోగ్య సేవలు అందించాలని నిబంధన విధించడం జరిగింది.ఇప్పుడు” క్యాష్ లెస్  ఏని  వేర్ ” ప్రొగ్రమ్ లో భాగంగా ఏ హాస్పిటల్ లోనైనా ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు

6) ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజెషన్ : కొన్ని వ్యాధులు ఉన్న పళంగా రాకపోవచ్చు హాస్పిటల్లో చేరే ముందే కొన్ని ఆరోగ్య పరీక్షలు చేసి వ్యాధిని గుర్తించవచ్చు ఈ ఖర్చులను మరియు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినా తర్వాత వ్యాధి తగ్గుదల కోసం మెడిసిన్ అవసరం రావచ్చు కావున ఈ రెండిటిని కవర్ చేసే పాలసీ ఎంచుకుంటే మంచిది

7) డే కేర్ చికిత్సలు ; అనగా 24 గంటల లోపు అయ్యే చికిత్సలు.డయాలసిస్ ,కీమో థెరపీ ,రేడియో థెరపీ ,అపెండెక్టమీ , స్టోన్స్ రిమూవల్స్ వంటి చికిత్సలు 24 గంటల లోపలే ఉంటాయి కావున డే కేర్ చికిత్సలు కవర్ చేసే పాలసీలను ఎంచుకోవటం ఉత్తమం

8) ప్రత్యాన్మయ చికిత్సలు ; మన దేశంలో అల్లోపతీ కాకుండా ఆయుర్వేదం, యునాని, సిద్ధ ,హోమియోపతి యోగ లాంటి ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి  కొందరు అల్లోపతి మందుల సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా వీటిని ఎంచుకోవటం జరుగుతుంది కావున వీటిటన్నింటిని కవర్ చేసే పాలసీని ఎంచుకోవటం మంచిది

9) ఉచిత ఆరోగ్య పరీక్షలు : ప్రతి సంవత్సరం పాలసీదారుడి ఆరోగ్యం ఫై శ్రద్ధ వహించి కొన్ని బీమా సంస్థలు ఉచితంగా ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నాయి .

10) నో క్లెయిమ్ బోనస్లు , ఆటోమేటిక్ రిస్టోరేషన్లు, మరియు టాప్ -అప్ లు, సూపర్ – టాప్ అప్ లు  , ఆడ్ -ఆన్ రైడర్స్ లాంటివి ఉండే పాలసీలు తినుకోవటం మంచిది.

మంచి ఆరోగ్య బీమా సంస్థ లేదా కంపెనీ ఎంపిక చెక్ లిస్ట్ ..?

ఒక బీమా బీమా సంస్థ తన పాలసీ ప్రణాళికలను పేపర్ ఫై అద్భుతంగా వ్రాసి పెట్టుకున్నప్పటికీ ఆచరణలో దాని అసలు పనితీరు తెలుస్తుంది అలాగే ఒక మంచి పాలసీ ఎంపికలో పాలసీ ఫీచర్స్ తో పాటు కంపనీ పనితీరును కూడా అంచనా వేసి సరైన నిర్ణయం తీసుకోవాలి అందుకోసం వీటిని పరిగణలోకి తీసుకోవాలి

బీమా సంస్థ ట్రాక్ రికార్డ్ : అనగా బీమా సంస్థ ఏర్పాటు పూర్వ ;పరాలు ఆర్ధిక నిల్వలు మార్కెట్లో పలుకుబడి పరిశీలించాలి కొత్తగా పుట్టుకచ్చిన కంపనీలు పనితీరును అంచనా వేయలేము కదా అందుకోసం బీమా సంస్థ ఏర్పడి కనీసం 10 సంవత్సరాలు అయినా ఉండే సంస్థను ఎంచుకోవటం ఉత్తమం

నెట్ వర్క్ హాస్పిటల్స్ : ఇది సంస్థ యొక్క పనితీరును తెలియజేస్తుంది . నగదు రహిత చికిత్సల కోసం ఒక మంచి బీమా సంస్థ తమ పాలసీదార్ల కోసం ఎక్కువ ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉంటుంది సంస్థతో భాగస్వామ్యం లేని ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటే తక్షణం నగదు చెల్లించి తర్వాత రీయింబర్సు మెంట్ ద్వారా వైద్య బిల్లులను తిరిగి పాలసీదారుడు పొందవచ్చు ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్నది అందుకోసం కనీసం 10000 – వేలకు మించిన నెట్ వర్క్ ఆసుపత్రులు ఉన్న సంస్థను ఎంచుకోవటం ఉత్తమం

క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో : సంస్థకు వచ్చిన క్లెయిమ్స్ లో ఎన్ని పరిష్కరించిందో తెలియజేసే నివేదిక ఇది 100 కంప్లెయింట్స్ లో కనీసం 90 పరిష్కరించాలి కావున 90శతం CSR ఉన్న బీమా సంస్థను ఎంచుకోవటం ఉత్తమం .IRDAI ప్రతి సంవత్సరం ప్రతి బీమా సంస్థ పనితీరును తన నివేదికలో ప్రకటిస్తుంది

సాల్వెన్సీ రేషియో : ఇది బీమా సంస్థ యొక్క ఆర్ధిక సామర్ధ్యాన్ని పరిపుష్టిని తెలియ జేస్తుంది ఎక్కువ సాల్వెన్సీ రేషియో ఉంటె సంస్థ పాలసీదార్ల అవసరాలు తీర్చడంలో వెనక్కు తగ్గదు .IRDAI పాలసీ సంస్థలను కచ్చితంగా 1.5 శాతం సాల్వెన్సీ రేషియో ఉండాలని ఆదేశిస్తుంది .కావున కనీసం 1.5 సాల్వెన్సీ రేషియో ఉన్న సంస్థను ఎన్నుకోవటం ఉత్తమం

విస్తృత ప్రణాళికలు గల సంస్థ: ఒక సంస్థలో అనేక రకాల ఇతర ప్రణాళికలు కాన్సర్ ,గుండె సంబంధిత పాలసీలు లాంటి అనేక విస్తృత ప్రణాళికలు కలిగి ఉన్న బీమా సంస్థ ఎన్నుకోవటం ఉత్తమం

సంస్థ ప్రతిస్పందన తీరు : బీమా సంస్థ పనితీరు ,చురుకుదనం పాలసీదారులతో ఎప్పటికప్పుడు ప్రతిస్పందించడం ,సమస్యలను పరిష్కరించడం, క్యాష్ లెస్ క్లెయిమ్స్ కోసం వెంటనే అప్రూవల్స్ ఇవ్వటం లాంటివి సంస్థ పనితీరు సామర్ధ్యాన్ని తెలియజేస్తాయి దీని కోసం IRDAI నివేదికలు పాలసీదార్ల రివ్యూ లు, అనుభవాలు పరిగణలోకి తీసుకోవాలి

ఆరోగ్య బీమాలో కవర్ చెయ్యాని  వ్యాధులు లేదా మినహాయింపు సందర్భాలు :  కొన్ని రకాల వ్యాధులు లేదా కొన్ని సందర్భాలలో ప్రత్యేకించి కవర్ చెయ్యబడవు ఇవి ఒక్కో బీమా సంస్థకు ఒక్కో విధంగా ఉండవచ్చు. అయితే కొన్ని సాధారణ మినహాయింపులు తెలుసుకుందాం.

1) సుఖరోగాలు HIV ,AIDS ,STDs లాంటి వ్యాధులను కవర్ చెయ్యదు

2) ఆత్మహత్య లేదా స్వయంగా తనకు తానే చేసుకొనే గాయాలకు కవర్ చేయబడదు

3) పుట్టుకతో వచ్చిన వ్యాధులు

4) యుద్ధం,ఉగ్రవాదం , సైనిక,అణు కార్యక్రమాల వాళ్ళ కలిగే గాయాలు

5) బిలాజికల్ ,కెమికల్,రేడియాక్టివ్ కార్యక్రంలో సంభవించే వ్యాధులకు

6) కాస్మొటిక్ సర్జరి , ప్లాస్టిక్ సర్జరీ  హార్మోన్ సర్జరీ లాంటివి లేదా అందం లేదా రూపం మార్చుకోవటం కోసం చేసే ఏ చికిత్సలకు కవర్ చెయ్యబడవు

7) అబార్షన్ ,వ్యంధత్వం లాంటి అనారొగ్య పరిస్థితులు కవర్ చెయ్యబడవు

8)  ప్రమాదకర లేదా సహస క్రీడలలో ఐన గాయాలకు సంబంధించిన పారా జుంపింగ్ ,రాక్ క్లిమ్బింగ్ ,పర్వతారోహణ ,రాప్టింగ్ మోటార్ రేసింగ్ ,గుర్రపు పందెం, స్కూబా డైవింగ్, హ్యాండ్ గ్లిడింగ్,  స్కై డైవింగ్ ,డీప్ సి డైవింగ్  లాంటివి వృత్తిపరంగా చేస్తే కవర్ చెయ్యబడవు. కానీ వీటినే వృత్తి పరంగా కాకుండా వినోదం కోసం శిక్షణ పొందిన ప్రొఫషనల్ పర్యవేక్షణలో చేసినపుడు ఐన గాయాలకు కవర్ చేయబడతాయి

9) పాలసీదారుడు ఆల్కహాల్ ,డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ,నికోటిన్ ,ఒపీయయీడ్స్ తీసుకొన్న మత్తులో ఏదేనా గాయాలు కవర్ చెయ్యబడవు

10) పాలసీదారుడు మద్యం మానెయ్యడంలో వచ్చిన with drawal మరియు డీ – అడిక్షన్ ట్రీట్మెంట్ కు కవర్ చేయబడదు

11) పొగాకు వినియోగిస్తూ ఓరల్,ఒరొ ఫారింక్స్ మరియు శ్వాస కోశ వ్యవస్త కాన్సర్ కు సంబంధించిన వ్యాధులను కవర్ చేయబడదు

ఈ మినహాయింపులు సంబంధించిన కచ్చితమైన సమాచారం కోసం మీ పాలసీ డాక్యుమెంట్ ను తప్పక చుడండి

ఆరోగ్య బీమా ప్రీమియంను  ప్రభావితం చేసే అంశాలు :

1)  వయస్సు: సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొద్ది ఆరోగ్యబీమా ప్రీమియం పెరుగుతుంది.అందుకే ఆరోగ్య బీమాను చిన్న వయసులోనే తీసుకోవాలని చెపుతుంటాము  యవ్వనంలో రోగ నిరోధకశక్తి ఎక్కువగాను వృధ్యాప్యంలో తక్కువ గాను ఉంటుంది అందుకే వృద్ధులు తరచు జబ్బు పడుతూ వుంటారు కావున సీనియర్ సిటిజన్స్ కి ప్రీమియం ఎక్కువ గాను ఉంటుంది

2) జెండర్ : పురుషులకన్నా స్త్రీలలో ఆరోగ్య బీమా తక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరిలో గుండెపోటు , ఆక్సిడెంటల్ ప్రమాదాలు తక్కువ కావున

3) జీవనశైలి : ధూమపానం,మద్యపానం లాంటివి  వ్యక్తి జీవనవిధానంఫై ఎక్కువ ప్రభావాన్ని చుపిస్తాయి మం దేశంలో నూటికి 60శాతం మరణాలు జీవన శైలి విధానం వళ్ళ  సంభవిస్తున్నాయి కావున వీరి విషయంలో బీమా సంస్థలు రిస్క్ అధికంగా ఉండటం చేత ప్రీమియంని అధికంగా వసూలు చేస్తాయి

4) వైద్య చరిత్ర: ఇప్పటికే ఏదయినా ఏదైనా వ్యాధులు లేదా వంశ పారంపర్యంగా సంక్రమించే వ్యాధులు ఉన్నట్లయితే ప్రీమియం పెరిగే అవకాశం ఉంది

5) ప్రాంతం :  మనం నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి ప్రీమియం ఆధారపడి ఉంటుంది ఆ ప్రాంతంలో వైద్య ఖర్చులు ప్రీమియంని ప్రభావితం చేస్తాయి  మన దేశములోని వివిధ ప్రాంతాలను A,B,C జోన్లుగా విభజించడం జరిగిందిం .ఇందులో A జోన్ ప్రీమియం అధికంగాను B జోన్ కొంచం తక్కువగాను C జోన్ A,B జోన్ల కన్నతక్కువ గాను ఉంటుంది .మన రెండు తెలుగు రాష్టాల్లో హైదరాబాద్,సికింద్రాబాద్ జోన్ B పరిధిలోకి మిగత ప్రాంతాలు జోన్ C పరిధిలోకి వస్తాయి

6) ప్లాన్ రకం : మనం ఎంచుకొనే ఆరోగ్య బీమా పాలసీ రకాన్ని బట్టీ ప్రీమియం ప్రభావితం అవుతుంది సాధారణ ఆరోగ్య పాలసీ కన్నా సీనియర్ సిటిజన్ ,మెటర్నిటీ పాలసిలా ప్రీమియం అధికంగా ఉంటుంది

7)అదనపు రైడర్స్ ; ఆరోగ్యబీమా పాలసీలో వివిధ రైడర్స్ ఉన్నాయి వాటిని ఆప్ట్ చేసుకున్నట్లయితే ప్రీమియం పెరిగే అవకాశం ఉంది

రోగ్య బీమాను రైడర్స్ :

మనం ఎంచుకున్న పాలసీ మన అన్ని అవసరాలు తీర్చకపోయినట్లయితే ఈ రైడర్స్ ని యాడ్ చేసుకోవచ్చు . ఈ ఆరోగ్య బీమా రైడర్స్ మన పాలసీకి అదనపు ప్రయోజనాన్ని అందిస్తాయి IRDAI ప్రకారం వీటి ప్రీమియం అసలు పాలసీ ప్రీమియం కన్నా 30 శాతం మించకూడదు

అవి;

మెటర్నిటీ రైడర్ : ఈ రైడర్ లో ప్రసూతి ఖర్చులు అనగా డెలివరీకి ముందు తర్వాత అయ్యే విద్య పరమైన ఖర్చులకు కవర్ చేస్తుంది. కొన్ని బీమా సంస్థలు పుట్టిన శిశువుకు అయ్యే వైద్య ఖర్చులు వక్సిన్స్ ఖర్చులు 90 రోజుల వరకు కవర్ చెయ్య బడుతాయి

క్రిటికల్ ఇల్ నెస్ రైడర్ : కాన్సర్ ,గుండె జబ్బులు  లాంటి 40కి పైగా తీవ్రమైన వ్యాధులను ఈ రైడర్ కవర్ చేస్తుంది పాలసీదారుడు కనుక ఈ వ్యాధులకు గురైతే ఆరోగ్య బీమా లో వైద్యం అందించడంతో పాటు అదనంగా పాలసీ హామీ మేరకు ఏక మొత్తంలో నేరుగా పాలసీదారుడి అకౌంట్ లో డబ్బులు బీమా సంస్థ జమ చేస్తుంది

వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్ : ఏదేని ప్రమాదంలో మరణంగాని,అంగ వైకల్యం ,శారీరక గాయాలు కలిగినట్లయితే ఆరోగ్య పాలసీలో వైద్యంతో పాటు దీనికి అదనంగా బీమా సంస్థ నుండి నేరుగా ఆర్ధిక పరిహారం పొందవచ్చు

హాస్పిటల్ క్యాష్ రైడర్ :  అనారోగ్యం లేదా ప్రమాద కారణంగా ఆసుపత్రిలో చేరిన పాలసీదారునికి వైద్య,కుటుంభం అవసరాల కోసం నేరుగా  రోజువారీ నగదును పాలసీ సంస్థ ఆర్ధిక పరిహారం అందిస్తుంది

గది అద్దె పరిమితి రైడర్ : కొన్ని ఆరోగ్య పాలసీలు  హాస్పిటల్ అద్దె గదిపై పరిమితి విదిస్తుంది . దీని ప్రభావం మిగతా అన్ని బిల్లులపై అదనంగా పడుతుంది కావున ఈ అదనపు ఖర్చులను కవర్ చెయ్యడానికి  ఈ రైడర్ ఉపయోగ పడుతుంది

పాలసీలో కవర్ చెయ్యని పరికరాలు : ఆసుపత్రిలో ఉపయోగించే కాటన్,బ్యాండేజ్ ,ధర్మామీటర్ ,సిరంజిలు,గ్లోవ్స్,మాస్కులు మెదలైన 60 కి పైగా ఆరోగ్య బీమాలో కవర్ చెయ్యని  వస్తువులు ఈ రైడర్ తో కవర్ చెయ్యబడతాయి

ఆరోగ్య బీమా కొనుగోలు అర్హతలు …?

ప్రవేశ వయస్సు 18 నుండి 65 సంవత్సరాలు
పిల్లలకు ,డిపెండెన్స్ కు పుట్టిన 90 రోజుల నుండి 25 సంవత్సరాలు
45 నుండి 60 సంవత్సరాల వయస్సు వరకు కొన్ని బీమా సంస్థలు తప్పకుండ ఫ్రీ మెడికల్ స్కీనింగ్ నిర్వహించవచ్చు
60 సంవత్సరాల ఫై బడిన వారికి సీనియర్ సిటిజెన్ హెల్త్ పాలసీని ఇస్తాయి దీనికి వైద్య పరీక్షలు తప్పనిసరి.

ఆరోగ్యబీమా క్లెయిమ్స్ ఏ విధంగా చెయ్యాలి; ఆరోగ్య బీమాలో రెండు రకాల క్లెయిమ్ పద్ధతులు ఉన్నాయి అవి ఒకటి కాష్ లెస్ క్లయిమ్స్ రెండు రీయింబర్సుమెంట్.వీటిని వివరంగబతెల్సుకుందాం

కాష్ లెస్ క్లెయిమ్ : అనగా మీకు ఆరోగ్య బీమా అవసరం పడి ఆసుపత్రిలో చేరితే అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని బీమా సంస్థనే చెల్లిస్తుంది.ఇందుకు మన జేబు నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.దీన్నే కాష్ లెస్ క్లెయిమ్ అంటారు


రీయింబర్సుమెంట్ క్లెయిమ్ : ఇందులో ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటున్నపుడు అయిన ఖర్చులను మీరె స్వయంగా మీ జేబు నుండి ఖర్చుపెట్టినప్పటికీ మీకు ఆరోగ్య బీమా ఉన్నట్లయితె ఆ ఖర్చులన్నింటిని ఆరోగ్య బీమా సంస్థ తిరిగి మీకు చెల్లిస్తుంది.దీన్నే రీయింబర్సుమెంట్ క్లెయిమ్ అంటారు

HEALTH INSURANCE – Telugu Policy

FAQ………